Yono SBI: ఎస్‌బీఐ యోనో వినియోగదారులకు OS అలర్ట్‌

ఎస్‌బీఐ యోనో (SBI Yono) వినియోగదారులకు అలర్ట్‌. పాత ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ వాడుతున్న వారు తమ ఓఎస్‌ వెర్షన్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని ఎస్‌బీఐ సూచించింది.

Published : 24 Sep 2022 13:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎస్‌బీఐ యోనో (SBI Yono) వినియోగదారులకు అలర్ట్‌. పాత ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ వాడుతున్న వారు తమ ఓఎస్‌ వెర్షన్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని ఎస్‌బీఐ సూచించింది. ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ 9 లేదా ఆపై వెర్షన్‌ వినియోగించాలని వినియోగదారులకు తెలిపింది. ఆండ్రాయిడ్‌ 9లోపు ఉన్న ఓఎస్‌ వెర్షన్లనకు గూగుల్‌ తన సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను నిలిపివేసిందని, కాబట్టి భద్రతపరంగా ఎలాంటి లోపాలూ లేని బ్యాంకింగ్‌ సేవలను ఆనందించాలంటే కనీసం ఆండ్రాయిడ్‌ 9 ఓఎస్‌ వెర్షన్‌ను వినియోగించాలని సూచించింది. 

సెక్యూరిటీ అప్‌డేట్స్‌ లేని ఫోన్లు వాడే వినియోగదారులపై సైబర్‌ నేరగాళ్లు విరుచుకుపడే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ఎస్‌బీఐ ఈ అలర్ట్‌ జారీ చేసింది. యోనో ఎస్‌బీఐ పేరిట యాప్‌ను, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సేవలను ఎస్‌బీఐ అందిస్తున్న సంగతి తెలిసిందే. బ్యాంకింగ్‌ మోసాలు జరగకుండా ఉండాలంటే.. ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ఐడీ, పాస్‌వర్డ్‌, ఎం-పిన్‌, పుట్టిన తేదీ, ఓటీపీ వంటి వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని ఎస్‌బీఐ సూచించింది. కేవైసీ, పాన్‌ అప్‌డేటింగ్‌ పేరుతో వచ్చే లింకులపై క్లిక్‌ చేయొద్దని కోరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని