Zomato: బ్లాక్‌డీల్‌ ద్వారా జొమాటోలో అలీబాబా షేర్ల విక్రయం

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ జొమాటోలో ఉన్న తన వాటాలను అలీబాబా గ్రూప్‌ తగ్గించుకోనుంది. ఇందులో భాగంగా 200 మి.డాలర్ల విలువైన షేర్లను డిస్కౌంట్‌లో బ్లాక్‌ డీల్‌ ద్వారా విక్రయించనుందని తెలుస్తోంది.

Published : 29 Nov 2022 19:41 IST

దిల్లీ: ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ జొమాటో (Zomato)లో అలీబాబా గ్రూప్‌ హోల్డింగ్ లిమిటెడ్‌ తన వాటాలను తగ్గించుకోనుంది. ప్రస్తుతం 13.3 శాతం వాటాలు కలిగిన ఉన్న ఆ కంపెనీ.. 3 శాతం మేర వాటాలను విక్రయించాలని చూస్తోంది. ఇందులో భాగంగా 200 మి.డాలర్ల (రూ.1600 కోట్లు) విలువైన షేర్లను బుధవారం బ్లాక్‌ డీల్‌ ద్వారా విక్రయించనుందని తెలుస్తోంది. అలీబాబా వాటాల విక్రయంపై అటు అలీబాబా గానీ, ఇటు జొమాటో గానీ స్పందించలేదు. బ్లాక్‌ డీల్‌లో 5-6 శాతం డిస్కౌంట్‌కే షేర్లను విక్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది. మంగళవారం జొమాటో షేర్‌ 63.55 వద్ద ముగిసింది. ఇప్పటికే జొమాటోలో ఉబర్‌ టెక్నాలజీస్‌ తన 7.8 శాతం వాటాను విక్రయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని