Electric buses: వచ్చే ఏడాదికి 7 వేల విద్యుత్‌ బస్సుల రోడ్లపైకి

దేశవ్యాప్తంగా త్వరలో భారీ సంఖ్యలో విద్యుత్‌ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే ఏడాది నాటికి 7 బస్సులు పరుగులు పెడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

Published : 12 Jan 2023 16:52 IST

గ్రేటర్‌ నోయిడా: దేశంలో విద్యుత్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా తీసుకొచ్చిన ఫేమ్‌-2 స్కీమ్‌ (FAME-2) కింద భారీ సంఖ్యలో విద్యుత్‌ బస్సులు (Electric buses) రోడ్లపైకి రానున్నాయి. వచ్చే ఏడాది నాటికి దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో దాదాపు 7 వేల వాహనాలు పరుగులు తీయనున్నాయని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సీనియర్‌ అధికారి హనీఫ్‌ ఖురేషీ తెలిపారు. ఇప్పటికే ఆయా నగరాల్లో 3 వేల బస్సులు నడుస్తున్నాయని చెప్పారు. దేశరాజధాని నగరంలో నిర్వహిస్తున్న ఆటో ఎక్స్‌పో-2023లో ఈ మేరకు ఆయన మాట్లాడారు.

విద్యుత్‌ వాహనాల వినియోగం పెంచి.. తద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గించాలన్న లక్ష్యంతో ఫేమ్‌-2 పథకాన్ని 2019లో కేంద్రం తీసుకొచ్చింది. ఇందులో భాగంగా 10 లక్షల విద్యుత్‌ టూవీలర్లు, 5 లక్షల త్రీవీలర్లు, 55 వేల ఫోర్‌ వీలర్లు, 7 వేల బస్సులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగానే వచ్చే ఏడాది నాటికి 7 వేల బస్సులు అందుబాటులోకి రానున్నాయని ఖురేషీ చెప్పారు. విద్యుత్‌ బస్సులకు మరిన్ని ప్రోత్సహకాలు అందించే ప్రణాళికలూ ఉన్నాయని చెప్పారు. ఈవీ వ్యవస్థను మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో సెల్‌ కెమిస్ట్రీ బ్యాటరీ తయారీదారులకు ప్రోత్సాహకాలు అందించేందుకు పీఎల్‌ఐ స్కీమ్‌ను కేంద్రం ప్రవేశపెట్టిందని చెప్పారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు