స్థిరమైన రాబడినిచ్చేలా...

దేశంలోని అగ్రశ్రేణి మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలైన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌, ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా రెండు ఫిక్స్‌డ్‌ మెచ్యూరిటీ పథకాలను (ఎఫ్‌ఎంపీ) ఆవిష్కరించాయి.

Updated : 30 Dec 2022 05:35 IST

దేశంలోని అగ్రశ్రేణి మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలైన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌, ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా రెండు ఫిక్స్‌డ్‌ మెచ్యూరిటీ పథకాలను (ఎఫ్‌ఎంపీ) ఆవిష్కరించాయి.

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఫిక్స్‌డ్‌ మెచ్యూరిటీ ప్లాన్‌ -సిరీస్‌ 88. ఈ పథకం వ్యవధి 1199 రోజులు. దీని ఎన్‌ఎఫ్‌ఓ వచ్చే నెల 3తో ముగుస్తుంది. ఇది క్లోజ్‌ ఎండెడ్‌ పథకం. కనీస పెట్టుబడి రూ.5,000. కాల వ్యవధి పూర్తయ్యే వరకూ పెట్టిన పెట్టుబడిని వెనక్కి తీసుకునే వీలుండదు. దరఖాస్తు చేసిన తేదీ నుంచి 1199 రోజులకు ఈ పథకం కాల వ్యవధి పూర్తవుతుంది. ఈ పథకానికి అనూజ్‌ తగ్రా, దర్శిల్‌ దేధియా ఫండ్‌ మేనేజర్లు. ‘క్రిసిల్‌ మీడియం టర్మ్‌ డెట్‌ ఇండెక్స్‌’ను ఈ పథకం పనితీరుకు కొలమానంగా తీసుకుంటారు.

* ఎస్‌బీఐ ఫిక్స్‌డ్‌ మెచ్యూరిటీ ప్లాన్‌ సిరీస్‌-74 పథకం వ్యవధి 1243 రోజులు. ఈ పథకం వచ్చే నెల 2తో ముగియనుంది. ఎన్‌ఎఫ్‌ఓలో కనీస పెట్టుబడి రూ.5,000. ఇది క్లోజ్‌ ఎండెడ్‌ పథకం. పెట్టిన పెట్టుబడిని పూర్తి కాలం కొనసాగించాలి. దీని పనితీరును ‘క్రిసిల్‌ మీడియం టర్మ్‌ డెట్‌ ఇండెక్స్‌’తో పోల్చి చూస్తారు. ఈ పథకాన్ని రంజన గుప్తా నిర్వహిస్తున్నారు.

తమ సొమ్మును బ్యాంకు పొదుపు ఖాతా, బ్యాంకు డిపాజిట్లలో కొనసాగించే బదులు మెరుగైన ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా అని చూసే వారికి ఇవి అనుకూలంగా ఉంటాయి. బ్యాంకు డిపాజిట్లతో పోలిస్తే కొంత అధిక వడ్డీ లభించడంతోపాటు, క్రెడిట్‌ రిస్కు తక్కువ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని