Amara Raja: నార్వే కంపెనీ ఐనోబాట్‌లో అమర రాజా అదనపు పెట్టుబడి

అమర రాజా ఎనర్జీ అండ్‌ మొబిలిటీ సంస్థ, ఐరోపాలోని నార్వేలో ఉన్న ఐనోబాట్‌ ఏఎస్‌ అనే కంపెనీలో అదనంగా 4.5% వాటాను 20 మిలియన్ల యూరోల (సుమారు రూ.180 కోట్ల)తో కొనుగోలు చేసింది.

Published : 21 Jun 2024 03:11 IST

9.32 శాతానికి పెరిగిన వాటా

ఈనాడు, హైదరాబాద్‌: అమర రాజా ఎనర్జీ అండ్‌ మొబిలిటీ సంస్థ, ఐరోపాలోని నార్వేలో ఉన్న ఐనోబాట్‌ ఏఎస్‌ అనే కంపెనీలో అదనంగా 4.5% వాటాను 20 మిలియన్ల యూరోల (సుమారు రూ.180 కోట్ల)తో కొనుగోలు చేసింది. దీంతో ఈ కంపెనీలో అమర రాజా ఎనర్జీ అండ్‌ మొబిలిటీ వాటా 9.32 శాతానికి పెరిగింది. ఈ సంస్థలో అమర రాజా ఎనర్జీ అండ్‌ మొబిలిటీ ఇంతకు ముందే 10 మిలియన్‌ యూరోల (సుమారు రూ.90 కోట్ల) పెట్టుబడి పెట్టింది. విద్యుత్తు వాహనాలకు అవసరమైన బ్యాటరీలు డిజైన్‌ చేయడంలో ఐనోబాట్‌ ఏఎస్‌ కు విశేష నైపుణ్యం ఉంది. ఈ కంపెనీలో పెట్టుబడి తమకు మేలు చేస్తుందని అమర రాజా విశ్వసిస్తోంది. ఇంధన రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలనేది తమ లక్ష్యమని అమర రాజా ఎనర్జీ అండ్‌ మొబిలిటీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ విక్రమాదిత్య గౌరినేని అన్నారు. ఐనోబాట్‌ ఏఎస్‌తో కలిసి వినూత్న ఉత్పత్తులు, సేవలను అంతర్జాతీయ మార్కెట్‌కు అందిస్తామని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని