Amazon Echo Pop: భారత్‌లోకి ‘అమెజాన్‌ ఎకో పాప్‌’ స్మార్ట్‌ స్పీకర్‌.. ధరెంతంటే?

Amazon Echo Pop: భారత్‌లో అమెజాన్‌ మరో స్మార్ట్‌ స్పీకర్‌ను విడుదల చేసింది. ఎకో పాప్‌ పేరిట వస్తున్న ఈ స్పీకర్‌లో అలెక్సా వాయిస్‌ అసిస్టెన్స్‌ సపోర్ట్ ఉంది.

Published : 01 Jun 2023 13:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘అమెజాన్‌ ఎకో పాప్‌ (Amazon Echo Pop)’ స్మార్ట్‌ స్పీకర్‌ గురువారం భారత్‌లో విడుదలైంది. మ్యూజిక్‌ ప్లేబ్యాక్‌, స్మార్ట్‌ హోమ్‌ డివైజెస్‌, సెట్టింగ్‌ రిమైండర్స్‌ను సపోర్ట్‌ చేసే అలెక్సా వాయిస్‌ అసిస్టెంట్‌ ఫీచర్‌ను దీంట్లో పొందుపర్చారు. వాయిస్‌ కమాండ్స్‌కు వేగంగా స్పందించే AZ2 Neural Edge ప్రాసెసర్‌ను ఇస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌ లేదా ట్యాబ్లెట్‌కు కనెక్ట్‌ చేసుకునేందుకు బ్లూటూత్‌ కూడా ఉంది.

అమెజాన్‌ ఎకో పాప్‌ ధర..(Amazon Echo Pop Price)

అమెజాన్‌ ఎకో పాప్‌ (Amazon Echo Pop) ధర భారత్‌లో రూ.4,999. బ్లాక్‌, గ్రీన్‌, పర్పుల్‌, వైట్‌ రంగుల్లో ఇది అందుబాటులో ఉంది. అమెజాన్‌ ఇ-కామర్స్‌ వెబ్‌సైట్‌లో దీన్ని కొనుగోలు చేయొచ్చు. క్రోమా, రిలయన్స్‌ డిజిటల్‌, పూర్విక వంటి రిటైల్‌ స్టోర్లలోనూ విక్రయానికి అందుబాటులో ఉన్నాయి.

అమెజాన్‌ ఎకో పాప్‌ స్పెసిఫికేషన్లు..(Amazon Echo Pop Specifications)

అమెజాన్‌ నుంచి గతంలో వచ్చిన ఎకో డాట్‌ స్పీకర్లు గుండ్రటి ఆకారంలో ఉండేవి. కానీ, తాజా ఎకో పాప్‌ (Amazon Echo Pop) అర్ధ గోళాకారంలో ఉంది. 1.95 అంగుళాల ఫ్రంట్‌ ఫైరింగ్‌ డైరెక్షనల్‌ స్పీకర్‌ వస్తోంది. స్పీకర్‌ యాక్టివ్‌ స్టేటస్‌ను తెలియజేసేలా ఎల్‌ఈడీ లైట్‌ను పొందుపర్చారు. అమెజాన్‌ ప్రైమ్‌ మ్యూజిక్‌, హంగామా, స్పోటిఫై, జియోసావన్‌, యాపిల్‌ మ్యూజిక్‌ను సపోర్ట్‌ చేస్తుంది. ఎకో డాట్‌ (5వ తరం)లో ఉన్న AZ2 Neural Edge ప్రాసెసర్‌నే దీంట్లోనూ ఇస్తున్నారు. వాల్యూమ్‌ కంట్రోల్‌ బటన్స్‌తో పాటు ఎప్పుడూ ఆన్‌లో ఉండే అలెక్సా మైక్రోఫోన్‌ను ఆఫ్‌ చేసేందుకూ ప్రత్యేక బటన్‌ ఉంది.

అమెజాన్‌ ఎకో పాప్‌ (Amazon Echo Pop)లో డ్యుయల్‌ బ్యాండ్‌ వైఫై, బ్లూటూత్‌ వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. రిమోట్‌ డివైజ్‌ల నుంచి కూడా ఆడియో స్ట్రీమింగ్‌ను సపోర్ట్‌ చేస్తుంది. దీని బరువు 196 గ్రాములు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని