Amazon, Flipkart నుంచి మరో సేల్‌.. ఈ కార్డులపై ఆఫర్లు!

Amazon, Flipkart sale Dates Announced:  ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థలైన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ మరో సేల్‌కు సిద్ధమయ్యాయి. ఆగస్టు 6 నుంచి ఐదు రోజుల పాటు సేల్స్‌ నిర్వహించనున్నాయి.

Published : 01 Aug 2022 18:55 IST

ఇంటర్నెంట్‌ డెస్క్‌: ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థలైన అమెజాన్‌ (Amazon), ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) మరో సేల్‌కు సిద్ధమయ్యాయి. గత నెల పోటా పోటీగా సేల్స్‌ నిర్వహించిన ఈ రెండు సంస్థలూ.. ఆగస్టు నెలలోనూ పోటీకి రెడీ అయ్యాయి. ఈ సారి రెండు సంస్థలూ ఒకే తేదీ నుంచి సేల్స్‌ ప్రారంభిస్తుండడం గమనార్హం. అమెజాన్‌ ‘గ్రేట్‌ ఫ్రీడమ్‌ ఫెస్టివల్‌’ పేరిట ముందుకొస్తుండగా.. ‘బిగ్‌ సేవింగ్స్‌ డేస్‌’ పేరిట ఐదు రోజుల ఆఫర్ల పండగకు ఫ్లిప్‌కార్ట్‌ తెరతీసింది.

జులై నెలలో ప్రైమ్‌ డే సేల్‌ నిర్వహించిన అమెజాన్‌.. ఈ సారి ‘ఫ్రీడమ్‌ ఫెస్టివల్‌’తో ముందుకొస్తోంది. ఆగస్టు 6 నుంచి 10వ తేదీ వరకు ఈ సేల్‌ నిర్వహించబోతోంది. గత నెల కేవలం ప్రైమ్‌ మెంబర్లకు మాత్రమే సేల్‌ నిర్వహించగా.. ఈ సారి అమెజాన్‌ కస్టమర్లందరికీ ఈ సేల్‌లో పాల్గొనే అవకాశం కల్పిస్తోంది. ఇందులో భాగంగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI)తో అమెజాన్‌ జట్టుకట్టింది. సేల్‌ రోజుల్లో కొనుగోళ్లపై 10 శాతం డిస్కౌంట్‌ అందించనుంది. స్మార్ట్‌ఫోన్లతో పాటు, ల్యాప్‌టాప్‌లు, టీవీలపై భారీ డిస్కౌంట్లు అందించనున్నారు. ప్రస్తుతానికి ఆఫర్ల వివరాలను అమెజాన్‌ పేర్కొననప్పటికీ.. త్వరలోనే వీటికి సంబంధించిన సమాచారాన్ని వెల్లడించనుంది.


ఫ్లిప్‌కార్ట్‌ సైతం ఆగస్టు ఆరో తేదీ నుంచి 10వ తేదీ వరకు ఫ్లిప్‌కార్ట్‌ ‘బిగ్‌ సేవింగ్‌ డేస్‌’ సేల్‌ను నిర్వహించనుంది. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ మెంబర్లకు ఒక రోజు ముందే యాక్సెస్‌ లభించనుంది. ఈ సేల్‌లో ఐసీఐసీఐ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ కార్డులతో కొనుగోళ్లపై 10 శాతం డిస్కౌంట్‌ లభించనుంది. ఒప్పో, వివో, యాపిల్‌, రియల్‌మీ, పోకో, శాంసంగ్‌ వంటి స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లు లభించనున్నాయి. ఆఫర్ల వివరాలు త్వరలోనే వెల్లడి కాన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని