Amazon: అమెజాన్‌ గ్రేట్‌ ఫ్రీడమ్‌ ఫెస్టివల్‌ ఆఫర్లు

ఈ-కామర్స్‌ దిగ్గజ సంస్థ అమెజాన్‌ ఇండియా అదిరిపోయే ఆఫర్లతో మరోసారి వినియోగదారులకు ముందుకొచ్చింది. ‘అమెజాన్‌ గ్రేట్‌ ఫ్రీడమ్‌ ఫెస్టివల్‌ ఆఫర్‌ 2021’ పేరుతో ఐదు రోజులపాటు భారీ తగ్గింపు

Published : 06 Aug 2021 22:26 IST

దిల్లీ: ఈ-కామర్స్‌ దిగ్గజ సంస్థ అమెజాన్‌ ఇండియా అదిరిపోయే ఆఫర్లతో మరోసారి వినియోగదారులకు ముందుకొచ్చింది. ‘అమెజాన్‌ గ్రేట్‌ ఫ్రీడమ్‌ ఫెస్టివల్‌ ఆఫర్‌ 2021’ పేరుతో ఐదు రోజులపాటు భారీ తగ్గింపు ధరలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్‌ ఆగస్టు 5 నుంచి 9వ తేదీ వరకు కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుందని అమెజాన్‌ ప్రకటించింది. ప్రత్యేకంగా వంటగది ఉపకరణాలపై దాదాపు 50 శాతం వరకూ డిస్కౌంట్‌ ఆఫర్లను ఇస్తున్నట్లు పేర్కొంది. దీని ప్రకారం ప్రెస్టేజ్‌ మిక్సర్‌ గ్రైండర్‌పై 51 శాతం, కెంట్‌ వాటర్‌ ప్యూరిఫైయర్‌పై 30 శాతం, ఓవెన్‌ టోస్టర్‌ గ్రిల్‌పై 20 శాతం, పిజియన్‌ కంపెనీ గ్యాస్‌ స్టౌవ్‌పై 60 శాతం వరకు డిస్కౌంట్‌ లభించనుంది. అలాగే టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లపైనా ఈ ఆఫర్‌ ఉంటుంది. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేసేవారికి 10 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ కూడా లభిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని