భారత్‌లోనూ అమెజాన్ ఎయిర్ సేవలు.. వస్తువుల డెలివరీ ఇక మరింత వేగవంతం!
వస్తువుల డెలివరీని వేగవంతం చేసేందుకు ప్రైమ్ ఎయిర్ పేరిట కొత్త సేవలను అమెజాన్ ప్రారంభించింది. హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఈ సేవలు ప్రారంభమయ్యాయి.
హైదరాబాద్: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) భారత్‌లో అమెజాన్ ఎయిర్ (Amazon Air) సేవలను ప్రారంభించింది. ఇందులో భాగంగా వస్తువులను త్వరగా డెలివరీ చేయడానికి గానూ కార్గో విమానాలను వినియోగించుకోనుంది. హైదరాబాద్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఈ సేవలను అమెజాన్ ప్రారంభించింది.
అమెజాన్ ఎయిర్ సేవల్లో భాగంగా ముంబయి, బెంగళూరు, హైదరాబాద్, దిల్లీ నగరాలకు వస్తువులను త్వరితగతిన డెలివరీ చేయడానికి గానూ బోయింగ్ 737-800 విమానాలను వినియోగించనుంది. ఇందుకోసం బెంగళూరుకు చెందిన క్విక్‌జెట్ సంస్థతో అమెజాన్ జట్టుకట్టింది. భారత్‌లో ఓ ఇ-కామర్స్ సంస్థ థర్డ్ పార్టీ విమానసేవలను వినియోగించుకోవడం ఇదే తొలిసారి. తొలుత 2016లో అమెరికాలో అమెజాన్ ఎయిర్ సేవలు ప్రారంభమయ్యాయి. తర్వాత యూకేకు విస్తరించారు. అమెరికా, యూకే తర్వాత ఈ సేవలను భారత్‌లో అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం. భారత్‌లో ఈ సేవలను ప్రైమ్ ఎయిర్ పేరిట తీసుకొచ్చారు.
అమెజాన్ ఎయిర్ వల్ల సుమారు 11 లక్షల మంది సెల్లర్లకు మేలు చేకూరనుందని అమెజాన్ ప్రతినిధి అఖిల్ సక్సేనా తెలిపారు. డెలివరీ నెట్‌వర్క్‌ను మరింత పటిష్ఠ పరిచేందుకు మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు. అమెజాన్ ఎయిర్ సేవలు ప్రారంభించడం పట్ల తెలంగాణ మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తంచేశారు. హైదరాబాద్ పట్ల అమెజాన్ ప్రేమ కొనసాగుతోందని ట్వీట్ చేశారు. అతిపెద్ద క్యాంపస్‌ను, డేటా సెంటర్, అతిపెద్ద ఫుల్ఫిల్మెంట్ సెంటర్‌ను ఇప్పటికే హైదరాబాద్‌లో అమెజాన్ ప్రారంభించిందని, తాజాగా అమెజాన్ ఎయిర్ సేవలనూ అందుబాటులోకి తెచ్చిందని పేర్కొన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social Look: హల్దీ వేడుకలో పూజాహెగ్డే.. సమంత ‘లైట్’ పోస్ట్!
-
India News
Loan Apps: 138 బెట్టింగ్ యాప్‌లు, 94 లోన్ యాప్‌లపై కేంద్రం కొరడా!
-
Politics News
KCR: నాగలి పట్టే చేతులు..శాసనాలు చేయాలి: కేసీఆర్
-
Movies News
Thaman: నెగెటివిటీపై తమన్ స్ట్రాంగ్ కౌంటర్
-
Sports News
Asia Cup 2023: ఆసియా కప్ 2023.. రమీజ్ అప్పటి వ్యాఖ్యలు.. ఇప్పుడు నజామ్ మాటల్లో..!
-
General News
పెదపారుపూడిలో రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భవనాలు.. ప్రారంభించిన శైలజాకిరణ్