Prime Video Channels: అమెజాన్ ప్రైమ్ వీడియోలో మరిన్ని ఛానెళ్లు
వీక్షకుల మరింత విస్తృత స్థాయి ఎంటర్టైన్మెంట్ అందించేందుకు మరో ఎనిమిది స్ట్రీమింగ్ సర్వీసులతో భాగస్వామ్యం కుదుర్చుకొన్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రకటించింది.....
దిల్లీ: వీక్షకుల మరింత విస్తృత స్థాయి ఎంటర్టైన్మెంట్ అందించేందుకు మరో ఎనిమిది స్ట్రీమింగ్ సర్వీసులతో భాగస్వామ్యం కుదుర్చుకొన్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రకటించింది. డిస్కవరీ+, లయన్స్‌గేట్ ప్లే, ఎరోస్ నౌ, డాక్యుబే, ముబి, హొయ్‌చొయ్, మనోరమా మ్యాక్స్, షార్ట్స్ టీవీ ఛానెళ్లను సైతం ప్రైమ్ వీడియో వేదికపై చూడొచ్చని వెల్లడించింది.
ఇవి యాడ్ ఆన్ సబ్స్క్రిప్షన్ కింద వీక్షకులకు అందుబాటులో ఉండనున్నాయి. వీటి వార్షిక సబ్స్క్రిప్షన్ ఛార్జీలు ఇలా ఉన్నాయి.. డిస్కవరీ+ రూ.299, ఎరోస్ నౌ రూ.299, లయన్స్‌గేట్ ప్లే రూ.699, మనోరమా మ్యాక్స్ రూ.699, ముబి రూ.1999, షార్ట్స్ టీవీ రూ.299. ప్రైమ్ సబ్స్క్రైబర్లకు డిస్కవరీ+, ఎరోస్ నౌ 25 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నాయి. హొయ్‌చొయ్ 33 శాతం, మనోరమా మ్యాక్స్ 30 శాతం, షార్ట్స్ టీవీ 40 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. ముబి సైతం ప్రవేశ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్‌నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!