Amazon LayOffs: భారత్‌లో 500 మందికి అమెజాన్‌ ఉద్వాసన!

Amazon LayOffs: రెండో విడతలో భాగంగా 9000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు అమెజాన్‌ మార్చిలో ప్రకటించింది. వీరిలో 500 మంది భారత్‌ నుంచి ఉన్నట్లు తాజాగా తెలిసింది.

Updated : 16 May 2023 13:42 IST

దిల్లీ: ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ భారత్‌లో 500 మంది ఉద్యోగులను తొలగించినట్లు (Amazon LayOffs) సమాచారం. అంతర్జాతీయంగా తమ కంపెనీలో పనిచేస్తున్న మొత్తం 9,000 మందిని ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తున్నట్లు మార్చిలో అమెజాన్‌ (Amazon LayOffs) ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే భారత్‌లో 500 మందిని ఇంటికి పంపినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తి ఒకరు తెలిపారు.

వెబ్‌సర్వీసెస్‌, హ్యూమన్‌ రీసోర్సెస్‌, సపోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి ఉద్యోగులను తొలగించినట్లు (Amazon LayOffs) తెలుస్తోంది. వీరిలో కొంత మంది కంపెనీ గ్లోబల్‌ ఆపరేషన్స్‌కు ఇక్కడి నుంచి పనిచేస్తున్న వారున్నారు. ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అస్థిరత నేపథ్యంలో ప్రాధాన్యాలకు అనుగుణంగా ఉద్యోగులను పునర్‌వ్యవస్థీకరించాలని నిర్ణయించినట్లు సీఈఓ ఆండీ జస్సీ మార్చిలో వెల్లడించిన విషయం తెలిసిందే.

కరోనా తర్వాత ఈ-కామర్స్‌ కంపెనీల ఆదాయాల్లోవృద్ధి నెమ్మదించింది. మరోవైపు మహమ్మారి సంక్షోభ సమయంలో డిమాండ్‌ పెరగడంతో అందుకు అనుగుణంగా భారీ ఎత్తున ఉద్యోగులను నియమించున్నాయి. కానీ, కరోనా పూర్వస్థితికి వ్యాపార కార్యకలాపాలు చేరుకోవడంతో డిమాండ్‌ మళ్లీ తగ్గింది. మరోవైపు మాంద్యం, వడ్డీరేట్ల పెంపు నేపథ్యంలో వినియోగదారులు కొనుగోలు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఫలితంగా చాలా కంపెనీలు వ్యయాలను నియంత్రించుకుంటాయి. అందులో భాగంగా మెటా, గూగుల్‌, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి దిగ్గజ సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. జనవరిలోనూ అమెజాన్‌ 18,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు (Amazon LayOffs) ప్రకటించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని