Amazon Lay Offs: అమెజాన్‌లో 10,000 ఉద్యోగాల కోత!

ఉద్యోగుల తొలగింపు విషయంలో మెటా, ట్విటర్‌ బాటలోనే అమెజాన్‌ కూడా నడిచే సూచనలు కనిపిస్తున్నాయి. దాదాపు 10 వేల మందికి ఉద్వాసక పలికేందుకు యోచిస్తున్నట్లు సమాచారం.

Published : 15 Nov 2022 10:15 IST

వాషింగ్టన్‌: అమెరికా ఇ-కామర్స్‌  దిగ్గజ సంస్థ అమెజాన్‌  10,000 మంది ఉద్యోగులను తగ్గించుకోనున్నట్లు తెలుస్తోంది. కార్పొరేట్‌, టెక్నాలజీ ఉద్యోగులను ఈ వారం నుంచే తొలగిస్తున్నట్లు సమాచారం.  ఆర్థిక మందగమనం నేపథ్యంలో కొత్త నియామకాలు చేపట్టడాన్ని ఆపేసినట్లు, గతవారం అమెజాన్‌ ఓ ఉన్నతాధికారికి పంపిన అంతర్గత మెమో ద్వారా తెలుస్తోంది. అమెజాన్‌ రోబోటిక్స్‌ బృందంలో పనిచేస్తున్న వారికి పింక్‌ స్లిప్‌ (తొలగింపు లేఖ)లు ఇచ్చారని ఆ అధికారి చెప్పినట్లు ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌ వెల్లడించింది. లింక్డ్‌ఇన్‌ ప్రకారం.. అమెజాన్‌ రోబోటిక్స్‌ విభాగంలో 3,766 మంది పనిచేస్తున్నారు. వీరిలో ఎంత మందిని ఇంటికి పంపించారనే విషయంపై ఆ ఆంగ్ల వెబ్‌సైట్‌ కచ్చిత వివరాలను వెల్లడించలేదు. లాభదాయకత లేని కొన్ని విభాగాల్లోని ఉద్యోగులను కొత్త ఉద్యోగాలు వెతుక్కోవాల్సిందిగా సూచించినట్లు, ‘లక్ష్యిత’ ప్రాజెక్టుల్లో మాత్రం కొత్త నియామకాల ప్రక్రియను అమెజాన్‌ కొనసాగించనున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని