Amazon Prime Day Sale: ఈ నెలలోనే అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌.. తేదీలు ఇవే!

Amazon Prime Day Sale: అమెజాన్‌ సంస్థ కొత్త సేల్‌ను ప్రకటించింది. ఈ నెలలోనే ప్రైమ్‌ డే సేల్‌ పేరుతో ముందుకు రానుంది.

Updated : 02 Jul 2024 14:03 IST

Amazon Prime Day sale | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌ను (Amazon Prime Day sale) ప్రకటించింది. ఈ సేల్‌ను జులై 20, 21 తేదీల్లో నిర్వహించనుంది. కేవలం ప్రైమ్‌ మెంబర్స్‌కు మాత్రమే నిర్వహించే ఈ సేల్‌లో మొబైల్స్‌, ల్యాప్‌టాప్స్‌ వంటి ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులతో పాటు ఇతర ప్రొడక్టులపైనా డిస్కౌంట్లు లభించనున్నాయి. 

ప్రైమ్‌ డే సేల్‌లో భాగంగా ఇంటెల్‌, శాంసంగ్‌, వన్‌ప్లస్‌, హానర్‌, ఐకూ, బజాజ్‌, ఆగ్రో, క్రాంప్టన్‌, సోనీ, ఐటీసీ, ఫాజిల్‌, పుమా, మోటోరొలా, బోట్‌ వంటి బ్రాండ్లపై ఆఫర్లు లభించనున్నాయి. సుమారు 450కి పైగా బ్రాండ్లు వేలాది కొత్త ప్రొడక్టులను లాంచ్‌ చేయనున్నట్లు అమెజాన్‌ పేర్కొంది. డిస్కౌంట్స్‌తో ప్రైమ్‌ వీడియోలో చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు, అమెజాన్‌ మ్యూజిక్‌లో పాటలను ఆనందించొచ్చని అమెజాన్‌ పేర్కొంది. త్వరలో ఆఫర్లు వివరాల వెల్లడి కానున్నాయి.

ఆ యాప్స్‌లో కరెంట్‌ బిల్లులు చెల్లించలేరు.. కారణం ఇదే..!

ఈ సేల్‌లో ఐసీఐసీఐ, ఎస్‌బీఐ డెబిట్‌/ క్రెడిట్‌ కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ పొందొచ్చు. ఐసీఐసీఐ, అమెజాన్‌ పే క్రెడిట్‌ కార్డు వినియోగదారులకు 5 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది. కొత్తగా ఈ కార్డు తీసుకునే వారికి ప్రైమ్‌ మెంబర్లకు వెల్‌కమ్‌ రివార్డుల కింద రూ.2,500 వరకు ప్రయోజనాలను అమెజాన్‌ అందిస్తోంది. నాన్‌ ప్రైమ్‌ మెంబర్లకు రూ.2 వేల వరకు ప్రయోజనాలతో పాటు 3 నెలల పాటు ప్రైమ్‌ మెంబర్‌ షిప్‌ ఇస్తోంది. ఇతర సేల్స్‌ సమయంలో ప్రైమ్‌ మెంబర్లకు ఒక రోజు ముందే కొనుగోలుకు అవకాశం లభిస్తుంది. ఫ్రీ, వన్‌ డే డెలివరీ వంటి ప్రయోజనాలూ ఉంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని