- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
Amazon Prime Day sale: అమెజాన్ ప్రైమ్ డే సేల్ తేదీలు ఫిక్స్.. ఈ కార్డులపై ప్రత్యేక ఆఫర్లు!
Amazon prime day sale: షాపింగ్ ప్రియులకు గుడ్‌న్యూస్. ప్రైమ్ మెంబర్ల కోసం అమెజాన్ కొత్త సేల్ తీసుకొస్తోంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ పేరిట (Amazon Prime Day sale) సేల్ నిర్వహించబోతోంది. దీనికి సంబంధించిన తేదీలను తాజాగా అధికారికంగా ప్రకటించింది. జులై 23-24 తేదీల్లో ఈ సేల్ నిర్వహించబోతున్నారు. స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, టీవీలు, దుస్తులు, అమెజాన్ డివైజులు, ఫర్నిచర్‌పై తదితర వస్తువులపై ఈ సేల్‌లో డిస్కౌంట్లు అందించనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. జులై 23 అర్ధరాత్రి 12 గంటల నుంచి 48 గంటల పాటు ఈ సేల్ జరగనుంది. 400 బ్రాండ్లకు చెందిన 30వేల కొత్త ఉత్పత్తులను విక్రయానికి ఉంచనున్నట్లు అమెజాన్ తెలిపింది. ఐసీఐసీఐ, ఎస్బీఐ కార్డుదారులకు 10 శాతం డిస్కౌంట్ అందించనున్నట్లు అమెజాన్ పేర్కొంది.
సేల్కు సంబంధించి ఇప్పటికే ఓ పేజీని అమెజాన్ సిద్ధం చేసింది. ఇందులో మొబైల్స్‌పై 40 శాతం వరకు, ల్యాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్స్‌పై 75 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నట్లు పేర్కొంది. ఎక్స్ఛేంజీ సదుపాయం కూడా ఉందని తెలిపింది. ఈ సేల్‌లో భాగంగా షావోమి, వన్‌ప్లస్, శాంసంగ్, ఐకూకు చెందిన కొన్ని మొబైల్స్‌ను తక్కువ ధరకే విక్రయించనున్నామని పేర్కొన్న అమెజాన్.. వాటి ధరలను మాత్రం రివీల్ చేయలేదు. సేల్ తేదీలు దగ్గరకొచ్చాక వాటి ధరలను తెలిపే అవకాశం ఉంది. అయితే ఈ సేల్ కేవలం ప్రైమ్ మెంబర్లకు మాత్రమే. కొత్తగా ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే ఏడాదికి రూ.1499 చెల్లించాల్సి ఉంటుంది. కేవలం నెలకు మాత్రమే తీసుకోవాలంటే రూ.179 చెల్లించాలి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Rajasingh: మునావర్ కామెడీ షో అడ్డుకుంటాం.. ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరిక
-
World News
Xi and Putin: బాలి సదస్సుకు జిన్‌పింగ్, పుతిన్..!
-
Movies News
Vijay Deverakonda: తెలుగు ప్రెస్‌మీట్ వివాదం.. స్పందించిన విజయ్ దేవరకొండ
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
DK: ఆ సమయంలో రోహిత్‌పై విమర్శకుల బంతులు దూసుకొచ్చాయి: డీకే
-
Crime News
రూ.20కోట్ల నగల దోపిడీలో ఊహించని ట్విస్ట్.. ఇన్స్పెక్టర్ ఇంట్లో 3.7కిలోల బంగారం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Puri Jagannadh: ఛార్మితో రిలేషన్‌షిప్‌పై పెదవి విప్పిన పూరి జగన్నాథ్
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (19/08/2022)
- మూడో కంటికి తెలియకుండా రెండు ఉద్యోగాలు.. ఇప్పుడు రిటైర్మెంట్
- Chahal-Dhanashree: విడాకుల రూమర్లపై స్పందించిన యుజువేంద్ర చాహల్
- Sanna Marin: మరో వివాదంలో ఫిన్లాండ్ ప్రధాని.. డ్యాన్స్ వీడియో వైరల్!
- Punjab: ₹150 కోట్ల స్కాం.. 11వేలకు పైగా యంత్రాలు మాయం!
- Trump: ట్రంప్ పర్యటనకు కేంద్రం ఎంత ఖర్చు చేసిందో తెలుసా?
- China: వరుణాస్త్రం బయటకు తీసిన డ్రాగన్..! ఎందుకు..?
- Arjun kapoor: అర్జున్.. ప్రజల్ని బెదిరించకు..నటనపై దృష్టి పెట్టు: భాజపా మంత్రి సలహా
- Subramanian Swamy: భాజపాలో ఎన్నికల్లేవ్.. అంతా ‘మోదీ’ ఆమోదంతోనే..!