Amazon prime Lite: అమెజాన్‌ నుంచి మరో ప్లాన్‌.. ప్రైమ్‌తో పోలిస్తే ధర కాస్త ‘లైట్‌’!

Amazon prime Lite: ప్రైమ్‌ తరహాలో ప్రైమ్‌ లైట్‌ పేరిట మరో ప్లాన్‌ తీసుకొచ్చేందుకు అమెజాన్‌ సన్నాహాలు చేస్తోంది. రూ.999కే కొన్ని మినహాయింపులతో అందుబాటులోకి తెచ్చేందుకు టెస్టింగ్‌ నిర్వహిస్తోంది.

Published : 15 Jan 2023 01:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రైమ్‌ వీడియో, మ్యూజిక్‌, షాపింగ్‌, ఇ-బుక్స్‌ ఇలా అన్నింటికీ కలిపి ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ (Amazon prime) అందిస్తోంది అమెజాన్‌. గతంలో రూ.999గా ఉన్న దీని ధరను కొన్ని నెలల క్రితం అమాంతం రూ.1,499కి పెంచేసింది అమెజాన్‌. దీంతో చాలా మంది ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు. దీంతో కాస్త తక్కువ ధరలో ఓ ప్లాన్‌ను తీసుకొచ్చేందుకు ఆ కంపెనీ ఆలోచన చేస్తోంది. అమెజాన్‌ ప్రైమ్‌ లైట్‌ (Amazon prime Lite) పేరిట రూ.999కే ఓ ప్లాన్‌ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

  • అమెజాన్‌ ప్రైమ్‌ తరహాలోనే లైట్‌లోనూ కొన్ని మినహాయింపులతో దాదాపు అవే సదుపాయాలను అందించబోతున్నారు. ప్రస్తుతం ఎంపిక చేసిన యూజర్లతో టెస్టింగ్‌ నిర్వహిస్తున్నారు. దశలవారీగా భారత్‌లో యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.
  • అమెజాన్‌ ప్రైమ్‌ యూజర్లకు సేమ్‌ డే డెలివరీ, వన్‌ డే డెలివరీ సదుపాయం ఉంది. లైట్‌ యూజర్లకు ఈ సదుపాయం ఉండదు. ఫ్రీ డెలివరీ, రెండ్రోజుల స్టాండర్డ్‌ డెలివరీ సదుపాయం మాత్రమే ఉంటుంది. 
  • ప్రైమ్‌ యూజర్లు ప్రైమ్‌ వీడియోను యాడ్స్‌ లేకుండా వీక్షించవచ్చు. అదే లైట్‌ యూజర్లకు యాడ్స్‌ వస్తాయి. పైగా ఎస్‌డీ క్వాలిటీ మాత్రమే వీక్షించేందుకు అనుమతి ఉంటుంది. ల్యాప్‌టాప్‌లో వీక్షించేందుకు వీలుండదు.
  • అమెజాన్‌ లైట్‌ యూజర్లు ప్రైమ్‌ మ్యూజిక్‌ను వినియోగించేందుకు అవకాశం ఉండదు. అలాగే ఫ్రీ ఇ- బుక్స్‌, గేమ్స్‌, నో కాస్ట్‌ ఈంఎఐ వంటి సదుపాయాలు వీరికి లభించవు.
  • ఒకవేళ మ్యూజిక్‌, బుక్స్‌, గేమ్స్‌ అవసరం లేదనుకునేవారికి ఈ ప్లాన్‌ ఉపయోగపడుతుంది. ఈ రెండూ కాకుండా అమెజాన్‌ ఏడాదికి రూ.599కే ప్రైమ్‌ వీడియో మొబైల్‌ ప్లాన్‌ అందిస్తోంది. ఇందులో ఎస్‌డీ క్వాలిటీలో వీడియోలు చూసేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఇతర సదుపాయాలేవీ ఉండవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని