Amul Milk: మరోసారి అమూల్‌ పాల ధరల పెంపు

Amul Milk Price: పెరిగిన పాల ధరలు శుక్రవారం నుంచే అమల్లోకి వస్తాయని అమూల్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

Updated : 03 Feb 2023 15:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమూల్‌ పాల ధరలు (Amul milk price) మరోసారి పెరిగాయి. అన్ని రకాల పాలపై ధరలు పెంచుతున్నట్లు అమూల్‌ బ్రాండ్‌ పేరిట మార్కెటింగ్‌ చేసే ‘గుజరాత్‌ కో-ఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (GCMMF)’ గురువారం రాత్రి ప్రకటన విడుదల చేసింది. గుజరాత్‌ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ పెరిగిన ధరలు అమలవుతాయని ఫెడరేషన్‌ సీనియర్‌ మేనేజర్‌ (సేల్స్‌) ప్రకాశ్‌ ఆటే తెలిపారు. లీటర్‌ పాలపై రూ.2 వరకు పెంచినట్లు ఎండీ జయేన్‌ మెహతా శుక్రవారం వెల్లడించారు.

తాజా పెంపుతో లీటర్‌ పాల ధరలు ఇలా ఉన్నాయి..

  • అమూల్‌ తాజా- రూ.54
  • అమూల్‌ గోల్డ్‌- రూ.66
  • అమూల్‌ ఆవు పాలు- రూ.56
  • అమూల్‌ ఏ2 గేదె పాలు- రూ.70

పెరిగిన ధరలు శుక్రవారం ఉదయం నుంచే అమల్లోకి వచ్చాయి. పాల ఉత్పత్తి, నిర్వహణ వ్యయాలు పెరిగిన కారణంగానే ధరల్ని సవరించాల్సి వస్తోందని GCMMF తెలిపింది. ఒక్క పశువుల దాణా ధరలే 20 శాతం వరకు పెరిగినట్లు పేర్కొంది. గత ఏడాది ఆగస్టు, అక్టోబరులోనూ అమూల్‌ లీటర్‌ పాలపై రూ.2 చొప్పున ధరల్ని పెంచింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని