Amazon Prime: ₹ 599కే ప్రైమ్‌ వీడియో సబ్‌స్క్రిప్షన్‌!

మొబైల్ వినియోగదారుల కోసం అమెజాన్‌ సరికొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ను ప్రకటించింది. దీంతో యూజర్లు తక్కువ ధరకే ప్రైమ్‌ ఒరిజినల్‌ కంటెంట్‌తోపాటు లైవ్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు, ఇండియన్‌, ఇంటర్నేషనల్‌ కంటెంట్‌ను వీక్షించవచ్చు. 

Updated : 07 Nov 2022 20:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మొబైల్‌ వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రైమ్‌ వీడియో సరికొత్త ప్లాన్‌ను ప్రకటించింది. ₹ 599 ధరకే ఏడాది సబ్‌స్క్రిప్షన్‌తో మొబైల్‌ ప్లాన్‌ను అందిస్తోంది. దీంతో యూజర్లు తక్కువ ఖర్చుతో ఒక మొబైల్‌లో ప్రైమ్‌ సేవలను పొందొచ్చు. ఈ ప్లాన్‌ సబ్‌స్రైబర్లు స్టాండర్డ్ డెఫినిషన్‌ (ఎస్‌డీ) క్వాలిటీతో మొబైల్‌లో కంటెంట్‌ను వీక్షించవచ్చు. కొత్త సబ్‌స్క్రిషన్‌ కింద యూజర్లకు ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లోనూ కంటెంట్‌ అందుబాటులో ఉంటుంది. అమెజాన్‌ ఒరిజినల్‌ కంటెంట్, లైవ్‌ క్రికెట్ మ్యాచ్‌లతోపాటు, ఇండియన్‌, ఇంటర్నేషనల్‌ షోలు, సినిమాలను ఎంజాయ్‌ చేయొచ్చు. ఒకవేళ హై రిజల్యూషన్‌తో కంటెంట్‌ను వీక్షించాలనుకుంటే ప్లాన్‌ను అప్‌గ్రేడ్‌ చేసుకోవాలి. ప్రస్తుతం భారతీయ యూజర్లకు మూడు సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో నెలవారీ ప్లాన్‌ ధర ₹ 179కాగా, మూడు నెలల ప్లాన్‌ ధర ₹ 459గా ఉంది. వార్షిక చందా ధర ₹1,499. 

ప్రైమ్‌ వీడియో మొబైల్‌ ప్లాన్‌ను గతేడాది భారతీ ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌ వినియోగదారులకు మాత్రమే పరిచయం చేసింది. తాజాగా ఈ ప్లాన్‌ను సాధారణ మొబైల్‌ యూజర్లకు సైతం అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలో ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగబోయే సిరీస్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో లైవ్‌ ప్రసారం  కానుంది. ఈ నేపథ్యంలో క్రికెట్‌ అభిమానులకు సైతం కొత్త మొబైల్‌ ప్లాన్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అమెజాన్‌ భావిస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని