Ambani: అంబానీ ఇంట పెళ్లి సందడి.. ఘనంగా అనంత్-రాధిక నిశ్చితార్థం
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. తన స్నేహితురాలు రాధికా మర్చంట్‌తో అనంత్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది.
ముంబయి: అపర కుబేరుడు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట పెళ్లిసందడి మొదలైంది. ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీకి, మర్చంట్ వారసురాలైన రాధికా మర్చంట్‌కు గురువారం నిశ్చితార్థం జరిగింది. రాజస్థాన్‌లోని నాథ్ద్వారాలోని శ్రీనాథ్జీ ఆలయంలో ఈ వేడుక ఘనంగా జరిగింది. దీనికి ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహితులు హాజరయ్యారు.
ఇదీ చదవండి: Radhika Merchant: అంబానీకి కాబోయే చిన్నకోడలి గురించి ఈ విశేషాలు తెలుసా?
రాధికకు అనంత్‌కు కొద్ది సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. వీరిద్దరూ వారి వారి కుటుంబాలకు చెందిన వ్యాపారాల్లో చురుగ్గా ఉన్నారు. అనంత్ అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించారు. బ్రౌన్ విశ్వవిద్యాలయం నుంచి పట్టా పొందిన ఆయన.. తర్వాత నుంచి రిలయన్స్‌లోని జియో, రిటైల్ వెంచర్స్ బోర్డుల్లో సభ్యుడిగా, వివిధ హోదాల్లో సేవలు అందించారు. ప్రస్తుతం ఈ సంస్థలోని ఎనర్జీ బిజినెస్‌కు నేతృత్వం వహిస్తున్నారు. న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుంచి రాధిక గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. ప్రస్తుతం ఎన్కోర్ హెల్త్‌కేర్ బోర్డు డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె తల్లిదండ్రులు శైలా, వీరెన్ మర్చంట్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
పుంగనూరు కేసులో కుమారుడికి బెయిల్ రాలేదని.. తల్లి ఆత్మహత్యాయత్నం
-
Supreme Court: అరుదైన ఘట్టం.. సంజ్ఞల భాషలో సుప్రీంకోర్టులో వాదన
-
TS TET Results: రేపు టెట్ ఫలితాలు
-
ఏసీ వేసుకుని నిద్రపోయిన డాక్టర్.. చలికి ఇద్దరు నవజాత శిశువుల మృతి
-
Imran khan: త్వరలో సకల సౌకర్యాలున్నజైలుకు ఇమ్రాన్
-
Chandrababu: నేడు సుప్రీంకోర్టు ముందుకు చంద్రబాబు పిటిషన్