Google chrome: క్రోమ్‌లో కొత్త సదుపాయం.. ఆండ్రాయిడ్ యూజర్లు ఇక వెబ్‌ పేజీలు వినొచ్చు

Google chrome: గూగుల్‌ క్రోమ్‌లో కొత్త సదుపాయం వచ్చింది. ఆండ్రాయిడ్‌ యూజర్లు వెబ్‌ పేజీలను వినే ఫీచర్‌ను గూగుల్‌ తీసుకొచ్చింది.

Published : 17 Jun 2024 15:01 IST

Google chrome | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ సెర్చింజన్‌ దిగ్గజం గూగుల్‌ (Google) తన క్రోమ్‌ బ్రౌజర్‌లో (Google chrome) కొత్త సదుపాయం తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్‌ యూజర్ల కోసం ‘లిజన్‌ టు దిస్‌ పేజ్‌’ (Listen to this page) ఫీచర్‌ను జోడించింది. దీనిద్వారా మీకు నచ్చిన వెబ్‌ పేజీలోని టెక్ట్స్‌ను ఇక ఆడియో రూపంలో వినొచ్చు. అంటే అచ్చం పాడ్‌ కాస్ట్‌లా అన్నమాట! ఈ సదుపాయాన్ని ఇప్పటికే గూగుల్ రోల్‌ అవుట్‌ చేసింది. త్వరలో అందరికీ అందుబాటులో రానుంది.

గూగుల్‌ తీసుకొచ్చిన ఈ సదుపాయం ప్రస్తుతానికి 12 భాషలకు సపోర్ట్‌ చేస్తుంది. ఇంగ్లిష్‌, హిందీ, బెంగాలీతో పాటు అరబిక్‌, చైనీస్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌, ఇండోనేసియన్‌, జపనీస్, పోర్చ్‌గీస్‌, రష్యన్‌, స్పానిష్‌ భాషల్లో ఆడియోను వినొచ్చు. ఆయా భాషల్లో స్క్రీన్‌ లాక్‌ చేసినా ఆడియో కొనసాగుతుంది. ఒకవైపు వింటూనే వేరే ట్యాబ్‌లను సైతం వాడుకోవచ్చు. పెద్ద పెద్ద వ్యాసాలు చదువుకోవడానికి ఈ ఫీచర్‌ బాగా ఉపయోగపడనుంది. ప్రస్తుతానికి అన్ని వెబ్‌ పేజీలకు ఈ ఫీచర్‌ పనిచేయడం లేదు. సపోర్ట్ చేసే పేజీలకు ప్లేబ్యాక్‌ సదుపాయం కనిపిస్తుంది.

కొన్ని నెలల్లో ఐపీఓల సందడి.. రూ.50 వేల కోట్ల సమీకరణ!

ఈ ఫీచర్‌ను ఉపయోగించాలంటే మీకు కావాల్సిన వెబ్‌పేజీ ఓపెన్‌ చేసి పైన కుడివైపు ఉండే త్రీడాట్స్‌ మెనూ ఓపెన్‌ చేయాలి. అక్కడ కనిపించే ‘లిజన్‌..’ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. వెంటనే పాడ్‌కాస్ట్‌లా వాయిస్‌ ప్రారంభం అవుతుంది. మ్యూజిక్‌ ప్లేయర్‌ తరహాలో పాజ్‌, రివైండ్‌, పాస్ట్‌ ఫార్వర్డ్‌ ఆప్షన్లను వినియోగించుకోవచ్చని గూగుల్‌ చెబుతోంది. వేగంగా వినాలనుకుంటే ప్లే బ్యాక్‌ స్పీడ్‌ను మార్చుకోవచ్చు. రూబీ, రివర్‌, ఫీల్డ్‌, మోస్‌ అనే నాలుగు రకాల వాయిస్‌ టైప్స్‌ ఉంటాయి. అందులో మీకు నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని