Anil Ambani: రిలయన్స్‌ పవర్‌, ఇన్‌ఫ్రా బోర్డు పదవులకు అనిల్‌ అంబానీ రాజీనామా

ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీ రిలయన్స్‌ పవర్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డైరెక్టర్‌ పదవులకు రాజీనామా చేశారు.

Updated : 26 Mar 2022 01:28 IST

న్యూదిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ రిలయన్స్‌ పవర్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డైరెక్టర్‌ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు రిలయన్స్‌ పవర్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వేరువేరుగా ప్రకటనలు జారీ చేశాయి. మోసపూరిత కార్యకలాపాలు చేపట్టారని ఆరోపణలు రావడంతో సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌, అనిల్‌ అంబానీతో పాటు మరో ముగ్గురిని మార్కెట్‌ నియంత్రణాధికారి సంస్థ సెబీ గత నెలలో నిషేధం విధించింది. స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ అయిన కంపెనీల నుంచి ఎలాంటి నిధులు సేకరించొద్దని సెబీ గత నెలలో మధ్యంతర ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నెల రోజుల అనంతరం అనిల్‌ అంబానీ కంపెనీ బోర్డు పదవులకు రాజీనామా చేశారు. 

రిలయన్స్‌ పవర్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీల్లో రాహుల్ సరిన్‌  స్వతంత్ర డైరెక్టర్‌గా అదనపు డైరెక్టర్‌ హోదాలో నియమితులయ్యారు. ఈయన ఐదేళ్లపాటు బోర్డులో కొనసాగనున్నారు. శుక్రవారం జరిగిన బోర్డు సమావేశాల్లో రెండు కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నారు.    

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు