- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
AIS Vs Form 26AS: ఐటీఆర్ ఫైలింగ్ కోసం ఒకే చోట పూర్తి సమాచారం
ఇంటర్నెట్ డెస్క్: పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం, మూలం వద్ద పన్ను (టీడీఎస్) సంబంధిత సమాచారాన్ని అందించేందుకు ఆదాయపు పన్ను శాఖ ఇప్పటి వరకు ఫారం- 26 ఏఎస్‌ను జారీ చేస్తోంది. అయితే దీని స్థానంలో వార్షిక సమాచార నివేదిక (యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్- ఏఐఎస్)ను తీసుకొచ్చింది. ఫారం 26 ఏఎస్‌తో పోలిస్తే ఇందులో మరింత సమాచారం అందుబాటులో ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో పొదుపు ఖాతాకు జమైన వడ్డీ, అమ్మిన, కొనుగోలు చేసిన షేర్ల విలువతో సహా మ్యూచువల్ ఫండ్ల లావాదేవీల పూర్తి సమాచారాన్ని వివరంగా అందిస్తుంది. ఒకేచోట పూర్తి సమాచారాన్ని అందించడం వల్ల ఫారం 26 ఏఎస్‌తో పోలిస్తే ఏఐఎస్‌తో పన్ను రిటర్నులు దాఖలు చేయడం సులభం అవుతుంది.
స్టాక్స్, బీమా, క్రెడిట్ కార్డులు, ఆస్తుల కొనుగోలు, మ్యూచ్‌వల్ ఫండ్లు, జీతం ద్వారా వచ్చే ఆదాయం లేదా వ్యాపారం నుంచి వచ్చే ఆదాయం, డివిడెండ్లు, బ్యాంకు పొదుపు ఖాతా డిపాజిట్లపై వడ్డీ ఇలా ఈ కొత్త వార్షిక సమాచార స్టేట్‌మెంట్‌లో పన్ను చెల్లింపుదారులకు సంబంధించి సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఫారం-26 ఏఎస్ ప్రాథమికంగా టీడీఎస్, టీసీఎస్ లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. దీంతో పోలిస్తే కొత్త ఏఐఎస్‌లో మరింత సమాచారం అందుబాటులో ఉంటుంది. పన్ను చెల్లింపుదారుని ప్రాథమిక సమాచారం మాత్రమే కాకుండా స్థిరాస్తుల అమ్మకం, కొనుగోలు, విదేశీ చెల్లింపులు, మ్యూచ్‌వల్ ఫండ్ లావాదేవీలు మొదలైన వాటికి సంబంధించిన అదనపు సమాచారాన్ని కలిగి ఉంటుంది. నివేదించిన సమాచారం నుంచి నకిలీ సమాచారాన్ని తొలగించిన తర్వాత సమాచారం ఏఐఎస్‌లో పొందుపరుస్తారు. పన్ను చెల్లింపుదారులు ఈ సమాచారాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ అనేది ట్యాక్స్ పాస్‌బుక్. ఇందులో నిర్దిష్ట ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ కింది సమాచారం అందుబాటులో ఉంటుంది.
* టీడీఎస్, టీసీఎస్ సంబంధిత సమాచారం.
* నిర్దిష్ట ఆర్థిక లావాదేవీలకు సబంధించిన సమాచారం
* పన్ను చెల్లింపులకు సంబంధించి
* డిమాండ్, రిఫండ్లకు సంబంధించి
* పెండింగ్‌లో ఉన్న ప్రొసీడింగ్స్ గురించిన సమాచారం
* పూర్తైన ప్రొసీడింగ్‌ల గురించిన సమాచారం
* సూచించిన ఆదాయ పన్ను అధికారి అప్‌లోడ్ చేయదగిన ఇతర సమాచారం
ఏఐఎస్‌ను యాక్సెస్ చేసే విధానం..
* ఏఐఎస్‌ను యాక్సెస్ చేసేందుకు పన్నుచెల్లింపుదారుడు ముందుగా ఇ-ఫైలింగ్ పోర్టల్‌కి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కొత్త యూజర్ అయితే ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి.
* లాగిన్ అయిన తర్వాత సర్వీసెస్ ట్యాబ్‌లో అందుబాటులో ఉన్న యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ (ఏఐఎస్) లింక్‌ను క్లిక్ చేసి యాక్సెస్ చేయొచ్చు.
* ఇప్పుడు స్క్రీన్‌పై ఒక మేసేజ్ కనిపిస్తుంది. ప్రొసీడ్ బటన్‌ను క్లిక్ చేస్తే ఏఐఎస్ హోమ్ స్క్రీన్‌కి రీడైరెక్ట్ అవుతుంది.
* ఇక్కడ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ (ఏఐఎస్), ట్యాక్స్‌పేయర్ ఇన్ఫర్మేషన్ సమ్మరీ (టీఐఎస్)లకు సంబంధించిన కీలక సూచనలను అందిస్తుంది. ఏఐఎస్‌లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని కేటగిరీల వారీగా టీఐఎస్ చూపిస్తుంది. ఇది అసలు, సవరించిన విలువలను సూచిస్తుంది. టీఐఎస్‌లో సవరించిన విలువను రిటర్నుల ప్రీ-ఫైలింగ్‌లో ఉపయోగిస్తారు.
* ఏఐఎస్‌పై క్లిక్ చేస్తే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సమ్మరీ (టీఐఎస్), యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ రెండూ కనిపిస్తాయి. డ్రాప్‌డౌన్ మెనూలో కావలసిన ఆర్థిక సంవత్సరాన్ని సెలక్ట్ చేసుకుని సమాచారం కోసం ఏఐఎస్‌పై క్లిక్ చేయాలి.
* తర్వాతి స్క్రీన్‌లో ఏఐఎస్‌లో ఉన్న సమాచారం పార్ట్- ఏ, పార్ట్- బి అని రెండు భాగాలుగా డిస్‌ప్లే అవుతుంది. పార్ట్- ఏలో పన్ను చెల్లింపుదారుని గురించి సాధారణ సమాచారం ఉంటుంది. పాన్, ఆధార్, పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ, చిరునామా మొదలైన వివరాలు ఉంటాయి.
పార్ట్-బిలో పన్ను చెల్లింపుదారుడు ఎంపిక చేసుకున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సమగ్ర సమాచారం ఉంటుంది. పార్ట్-బిలో ఈ కింది కేటగిరీల్లో సమాచారం పొందుపరుస్తారు.
* టీడీఎస్/టీసీఎస్ సమాచారం
* ఎస్ఎఫ్‌టీ సమాచారం
* పన్ను చెల్లింపులు
* డిమాండ్ అండ్ రిఫండ్
* ఇతర సమాచారం
ప్రతి కేటగిరీకి సంబంధించిన సమాచారాన్ని విడివిడిగా ఎక్సెల్ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మొత్తం ఏఐఎస్‌ను పీడీఎఫ్ లేదా జెఎస్ఓఎన్‌లో డౌన్‌లోడ్ చేసుకునే వీలుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Chahal-Dhanashree: చాహల్, ధనశ్రీ విడిపోతున్నారా.. ఆ పోస్టుల వెనుక అర్థమేంటీ?
-
India News
Sisodia: కేంద్రం కూడా కాదట.. మరి ఆ నిర్ణయం ఎవరిది?
-
India News
Anand Mahindra: వాసుకిని మెచ్చుకున్న ఆనంద్ మహీంద్రా..!
-
General News
Andhra News: యాప్ వివాదం.. ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి బొత్స చర్చలు విఫలం
-
Movies News
OTT Movies: 8వారాల తర్వాతే ఓటీటీలో సినిమా: దిల్‌రాజు
-
Politics News
Munugode: మునుగోడు ఉప ఎన్నిక ఇన్‌ఛార్జి కోసం భాజపా నేతల మధ్య పోటీ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Vinod kambli: బీసీసీఐ పింఛనే నాకు దిక్కు.. సచిన్ నుంచి ఏమీ ఆశించట్లేదు: వినోద్ కాంబ్లి
- Andhra News: వివాహితను భయపెట్టి నగ్న వీడియో కాల్..
- DK : ఆయన ఓటమిని అస్సలు తట్టుకోలేడు.. సహనం తక్కువే.. కానీ!
- Madhavan: ‘రాకెట్రీ.. మాధవన్ ఇంటిని కోల్పోయాడు’
- Liger: లైగర్ ఓటీటీ ఆఫర్ ఎందుకు వదులుకున్నారు?
- అజిత్ డోభాల్ ఇంటి వద్ద వ్యక్తి హల్చల్ ఘటన.. ముగ్గురు కమాండోలపై వేటు
- Vizag: విశాఖలో రౌడీషీటర్ హత్య.. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఘాతుకం
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (18/08/2022)
- Thiru review: రివ్యూ: తిరు
- Viral video: యూనిఫాంలో పోలీసుల ‘నాగిని డ్యాన్స్’.. వైరల్‌గా మారిన వీడియో