Electric scooter: మార్కెట్‌లోకి మరో కొత్త ఇ-స్కూటర్‌

విభిన్నమైన డిజైన్‌తో భారత మార్కెట్లోకి మరో కొత్త ఇ-స్కూటర్‌ లాంచ్‌ అయ్యింది, దీని ధర, ఫీచర్స్‌ తెలుసుకోండి.

Published : 23 Feb 2023 13:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్‌ వెహికల్‌ స్టార్టప్‌ ‘రివర్‌’ (River) తన తొలి స్కూటర్‌ను లాంచ్‌ చేసింది. ‘ఇండీ’గా (Indie) దీనికి నామకరణం చేసింది. దీని ధరను రూ.1.25 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్‌, బెంగుళూరు) పేర్కొంది. దీని డెలివరీలు ఆగస్టు నుంచి ప్రారంభం కానున్నాయి.

ఇక ఈ స్కూటర్‌ ఫీచర్ల విషయానికొస్తే.. ‘ఇండీ’ గరిష్ఠ వేగం గంటకు 90 కి.మీ. ఇది స్కూటర్ల SUVగా కంపెనీ పేర్కొంది. 4kWh బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఈ స్కూటర్‌ ఒకసారి పూర్తి ఛార్జింగ్‌తో 120 కి.మీ దూరం వరకు ప్రయాణిస్తుంది. ఇందులో మూడు రైడింగ్‌ మోడ్‌ (ఎకో, రైడ్‌, రష్‌)లు ఉన్నాయి. ప్రామాణిక ఛార్జర్‌ను ఉపయోగించి ఈ స్కూటర్‌ను 5 గంటల్లో 80% వరకు ఛార్జ్‌ చేయొచ్చు.

స్కూటర్‌ బుకింగ్‌లు కూడా మొదలయ్యాయని, రూ.1250తో బుక్‌ చేసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ వెబ్‌సైట్‌లో ప్రీ-బుకింగ్‌ సదుపాయం కల్పించినట్లు తెలిపింది. పూర్తి డబ్బులు చెల్లించిన తర్వాత స్కూటర్‌ను డెలివరీ చేస్తారు. వేరే స్కూటర్లతో పోలిస్తే ఇండీ స్కూటర్‌ ముందు భాగం కాస్త భిన్నంగా ఉంది. స్కూటర్‌, బ్యాటరీ రెండింటికీ 5 సంవత్సరాలు/50,000 కి.మీ వారంటీ అందిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని