Apple Diwali sale: 26 నుంచి యాపిల్‌ దివాలీ సేల్‌.. ఐఫోన్లపై ఫ్రీ గిఫ్ట్స్‌!

సెప్టెంబర్‌ 26 నుంచి యాపిల్‌ (Apple) దివాళీ సేల్స్‌ (Apple India Diwali sale) నిర్వహించనుంది.

Published : 24 Sep 2022 02:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వరుస పండగల నేపథ్యంలో ఒక్క ఇ-కామర్స్‌ సంస్థలే కాదు.. మొబైల్‌ కంపెనీలు సైతం సేల్స్‌ నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే ప్రముఖ మొబైల్‌ కంపెనీలైన షావోమి, వన్‌ప్లస్‌ సంస్థలు సేల్స్‌ను ప్రారంభించాయి. త్వరలో యాపిల్‌ (Apple) సైతం దీపావళి సేల్స్‌ (Apple India Diwali sale) నిర్వహించనుంది. సెప్టెంబర్‌ 26 నుంచి యాపిల్‌ వెబ్‌సైట్‌లో ఈ సేల్‌ జరగనుందని ఆ కంపెనీ వెల్లడించింది. సేల్‌లో భాగంగా యాపిల్‌ ఐఫోన్లు, ఎయిర్‌పాడ్స్‌, ఐప్యాడ్స్‌, మ్యాక్‌బుక్స్‌, ఇయర్‌ఫోన్లపై ఆఫర్లు ప్రకటించే అవకాశం ఉంది.

సేల్‌లో భాగంగా ఏమేం ఆఫర్లు ఇస్తున్నదీ యాపిల్‌ వెల్లడించలేదు. అయితే, లిమిటెడ్‌ పీరియడ్‌ ఆఫర్లు, ఫ్రీగిఫ్ట్‌లు అందించే అవకాశం ఉంది. ముఖ్యంగా యాపిల్‌ ఐఫోన్‌ 13, ఐఫోన్‌ 13 మినీ కొనుగోలుపై ఎయిర్‌పాడ్స్‌ను ఉచితంగా అందించే అవకాశం ఉంది. గతేడాది, అంతకుముందు ఏడాది సైతం ఇదే విధంగా ఐఫోన్‌ 11, ఐఫోన్‌ 12పై కంపెనీ ఎయిర్‌పాడ్స్‌ను యాపిల్‌ ఉచితంగా ఇచ్చింది. ఈ సారి కూడా ఇదే తరహాలో ఎయిర్‌పాడ్స్‌ను ఉచితంగా ఇచ్చే అవకాశం ఉంది. ఐఫోన్‌ కొనుగోళ్లపై కార్డు ఆఫర్లు ప్రకటించే అవకాశం ఉంది.

ఇప్పటికే అమెజాన్‌ నిర్వహిస్తున్న గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌, ఫ్లిప్‌కార్ట్‌ నిర్వహిస్తున్న బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో యాపిల్‌ ఐఫోన్లు డిస్కౌంట్‌కే లభిస్తున్నాయి. అయితే, ఫ్లిప్‌కార్ట్‌ తన సేల్‌లో ఐఫోన్‌ 13ను తొలుత రూ.48వేలకే విక్రయించింది. ప్రస్తుతం రూ.56,900కు విక్రయిస్తోంది. అలాగే ఐఫోన్‌ 12ను అమెజాన్‌ తొలుత రూ.42,999కు విక్రయించగా.. ఇప్పుడు రూ.44,999కి అందుబాటులో ఉంచింది. ఎవరైతే ఈ సేల్స్‌లో తక్కువ ధరకు యాపిల్‌ ఫోన్లను దక్కించుకోలేకపోయారో వారు యాపిల్‌ దివాలీ సేల్‌పై లుక్కేయొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని