iPhone SE: వచ్చే ఏడాది ఎస్‌ఈ 4 మోడల్‌ లేనట్టే!

iPhone SE 4th generation: ఐఫోన్‌ ఎస్‌ఈ నాలుగోతరం ఫోన్‌ను లాంచ్‌ చేసే విషయంలో యాపిల్‌ వెనకడుగు వేసినట్లు తెలిసింది. ఈ విషయంలో తన ప్రణాళికను రద్దు చేసుకున్నట్లు సరఫరాదారులకు తెలియజేసినట్లు సమాచారం.

Published : 07 Jan 2023 16:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికాకు చెందిన దిగ్గజ సంస్థ యాపిల్‌ తన నాలుగో జనరేషన్‌ ఐఫోన్‌ ఎస్‌ఈ (iPhone SE) తీసుకొచ్చే విషయంలో తన వ్యూహాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. 2024లో ఈ మోడల్‌ను తీసుకురావాలని భావించిన యాపిల్‌ ఆ నిర్ణయాన్ని మార్చుకుంది. ఈ మేరకు కొత్త మోడల్‌కు సంబంధించిన ప్రణాళికలను రద్దు చేసుకున్నట్లు సరఫరాదారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఖరీదైన ఐఫోన్లను సామాన్యులకు చేరువ చేసేందుకు ఐఫోన్ ఎస్ఈ మోడల్స్‌ను యాపిల్‌ తీసుకొస్తు్న్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎస్‌ఈ సిరీస్‌లో మూడు జనరేషన్‌ ఫోన్లను విడుదల చేసింది.

తర్వాతి తరం ఎస్ఈ మోడల్‌లో 5జీని తీసుకురావాలని తొలుత యాపిల్‌ భావించింది. ఇందుకోసం సొంతంగా అభివృద్ధి చేసిన 5జీ చిప్‌ను వినియోగించాలని కంపెనీ ప్రణాళిక రూపొందించింది. ఎస్‌ఈ మోడల్‌లో 5జీ చిప్‌ విజయవంతమైతే దానిని ఐఫోన్16లో ప్రవేశపెట్టాలని కంపెనీ తొలి ఆలోచన. అయితే, కంపెనీ ఆ ప్రయత్నాలను విరమించుకున్నట్లు తెలుస్తోంది. మధ్యస్థాయి నుంచి తక్కువ స్థాయి ఐఫోన్లకు ఆదరణ తక్కువగా ఉంటుండడమే దీనికి కారణమని ప్రముఖ అనలిస్ట్‌ మింగ్-చి-కువో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని