యాపిల్‌ కంప్యూటర్‌ @ రూ.11కోట్లు!

యాపిల్‌ కంప్యూటర్‌ ధర రూ. అన్ని కోట్లు ఉండటమేంటని ఆశ్చర్యపోతున్నారా? మరి అది మాములు కంప్యూటర్‌ కాదు.. యాపిల్‌ వ్యవస్థాపకుడు స్టీవ్‌ జాబ్స్‌.. స్టీవ్‌ వొజ్నియాక్‌

Published : 11 Feb 2021 19:13 IST

అమెరికా: యాపిల్‌ కంప్యూటర్‌ ధర రూ. అన్ని కోట్లు ఉండటమేంటని ఆశ్చర్యపోతున్నారా? మరి అది మాములు కంప్యూటర్‌ కాదు.. యాపిల్‌ వ్యవస్థాపకుడు స్టీవ్‌ జాబ్స్‌.. స్టీవ్‌ వొజ్నియాక్‌ 1976లో ఆవిష్కరించిన తొలి యాపిల్‌ 1 కంప్యూటర్‌ అది.

అమెరికాకు చెందిన కృష్ణ బ్లాకే అనే వ్యక్తి ఈ యాపిల్‌ 1 కంప్యూటర్‌ను 1978లో కొనుగోలు చేశాడట. ప్రస్తుతం దీన్ని ఈ-బేలో అమ్మకానికి పెట్టాడు. ఇప్పటికీ కంప్యూటర్‌ పని చేస్తుండటం విశేషం. చెక్కపెట్టెలో కీబోర్డుతో ఉండే ఈ కంప్యూటర్‌ ధర 15లక్షల డాలర్లు(రూ. 11కోట్లు)గా నిర్ణయించాడు. షిప్పింగ్‌ ఛార్జి 450 డాలర్లు(రూ.32వేలు) అదనం. విదేశాలకు పంపాల్సి వస్తే అంతర్జాతీయ ఛార్జీలు వర్తిస్తాయి. కొనుగోలు చేసే వారికి ఈ కంప్యూటర్‌తోపాటు దీన్ని ఎలా ఉపయోగించాలో తెలిపే మాన్యువల్‌ బుక్‌.. ఔట్‌పుట్‌ కోసం సోనీ టీవీ-115 మానిటర్‌ వస్తాయి. ఈ కంప్యూటర్‌లో బేసిక్‌ లాంగ్వేజ్‌, గేమ్స్‌, లో అండ్‌ హై మొమోరీ టెస్ట్‌, యాపిల్‌ 30వ వార్షికోత్సవం వీడియో ఉన్నాయట. ‘‘ఈ కంప్యూటర్‌ ఎంతో విలువైనది. పాడయ్యే లేదా దొంగలు ఎత్తుకెళ్లే ప్రమాదం ఉంది. అందుకే కొత్త యజమాని చెంతకు చేరేవరకు ఈ కంప్యూటర్‌ను ఫ్లోరిడాలోని బ్యాంక్‌ లాకర్‌లో భద్రంగా దాచిపెట్టాను’’అని కృష్ణ వెల్లడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని