Published : 26 Jul 2022 02:36 IST

Apple sales in India: యాపిల్‌ దూకుడు.. భారత్‌లో ఐఫోన్‌ అమ్మకాలు డబుల్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో యాపిల్‌ ఐఫోన్‌ (iphone) అమ్మకాలు పెరిగాయి. భారత్‌లో తయారీ ఆ కంపెనీకి భారీగా కలిసొచ్చింది. దీంతో ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ఏకంగా ఆ కంపెనీ 12 లక్షల ఫోన్లను విక్రయించింది. గతేడాదితో పోలిస్తే దాదాపు 94 శాతం విక్రయాలు పెరగడం గమనార్హం. ఆ సంస్థ విక్రయిస్తున్న ఐఫోన్‌ 12, ఐఫోన్‌ 13 మోడళ్లు భారీగా అమ్ముడుపోవడమే కారణమని మార్కెట్‌ రీసెర్చి సంస్థ సైబర్‌ మీడియా రీసెర్చి (CMR) తెలిపింది. ఇందులో 10 లక్షల ఫోన్లు భారత్‌లో తయారైనవేనని పేర్కొంది.

దేశంలో అమ్ముడుపోయిన మోడళ్లలో అత్యధికంగా ఐఫోన్‌ 12వే కావడం (41 శాతం) గమనార్హం. 32 శాతం వాటాతో ఐఫోన్‌ 13 రెండో స్థానంలో ఉంది. ఐఫోన్‌ 11 (17శాతం), ఐఫోన్‌ 13 ప్రో (4 శాతం), ఐఫోన్‌ 13 ప్రో మ్యాక్స్‌ (3శాతం) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇదే కాలంలో 2 లక్షల ఐప్యాడ్‌లు అమ్ముడుపోయినట్లు సీఎంఆర్‌ వెల్లడించింది. ఈ విభాగంలో సైతం గతేడాదితో పోలిస్తే విక్రయాలు 34 శాతం పెరిగాయి. గత త్రైమాసికంతో పోల్చినప్పుడు అమ్మకాలు కొద్దిగా తగ్గాయి. హైబ్రిడ్‌వర్క్‌ మోడల్‌, విద్య, వినోదం కోసం ఎక్కువ మంది ట్యాబ్లెట్లను వినియోగిస్తున్నారని, ఈ క్రమంలో ఐప్యాడ్‌ విక్రయాలు పెరిగినట్లు CMR విశ్లేంచింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని