Gold Loan: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? ఇవి గుర్తుంచుకోండి..
బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలు రెండు బంగారు రుణాలు అందిస్తాయి.
ఇంటర్నెట్ డెస్క్: చిన్న మొత్తంలో నగదు అవసరమైతే బంగారాన్ని బ్యాంకులో తాకట్టుపెట్టి నగదు తీసుకోవచ్చు. నిర్ణీత కాలవ్యవధిలో తిరిగి చెల్లించి బంగారాన్ని తెచ్చుకోవచ్చు. అత్యవసర స్థితిలో, చిన్న మొత్తంలో డబ్బు అవసరమైనప్పుడు స్నేహితులు, బంధువుల వద్ద డబ్బు కోసం ప్రయత్నించే కంటే ఇలా చేయడం మంచిది. పైగా క్రెడిట్ స్కోరుతో పని లేకుండానే బంగారంపై రుణాలను జారీ చేస్తాయి బ్యాంకులు. త్వరితగతిన పొందే వీలుంది. రుణం ఇచ్చేటప్పుడు రుణగ్రహీత తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని అంచనా వేయవు. ఇటువంటి రుణాలు చిన్న వ్యాపారులకు, తాత్కాలిక నగదు సమస్యలకు లేదా అత్యవసరంగా డబ్బు కావాల్సి వచ్చినప్పుడు సహాయపడతాయి. బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలు (ఎన్బీఎఫ్సీ) బంగారు రుణాలు అందజేస్తుంటాయి. మణప్పురం, ముత్తూట్ ఫైనాన్స్ వంటి ఎన్బీఎఫ్సీలు బంగారు రుణ వ్యాపారంపైనే దృష్టి సారించాయి. కాబట్టి అవి త్వరగా రుణాన్ని పంపిణీ చేస్తుంటాయి.
బ్యాంకులు Vs ఎన్బీఎఫ్సీలు
బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల మధ్య ఒక ముఖ్యమైన వ్యత్యాసం ఉంది. బ్యాంకుల తక్కువ వడ్డీ రేట్లకే రుణం మంజూరు చేస్తాయి. ఎన్బీఎఫ్సీలు ఎక్కువ మొత్తంలో రుణాలు ఇస్తాయి. అయితే వడ్డీ కాస్త ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు రుణ గ్రహీత దగ్గర 20 గ్రాముల బంగారు హారం ఉందనకుందాం. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు రెండూ రుణ గ్రహీతకు బంగారం విలువలో 75 శాతం రుణం అందిస్తుంటాయి. ఒక బ్యాంక్ మీ బంగారాన్ని 10 గ్రాములకు రూ.46,500 చొప్పున విలువ కడితే, ఎన్బీఎఫ్సీలు అంతకంటే ఎక్కువ మొత్తాన్ని రుణంగా ఇచ్చే వీలుంది. వేగంగా రుణాలు ఇవ్వగలవు. బ్యాంకుల విషయానికొస్తే నిబంధనలను అనుసరించి రుణాలను జారీ చేస్తాయి కాబట్టి కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది.
బంగారం ఏ రూపంలో ఉంటే.. రుణం ఇస్తారు?
బంగారం కనీస స్వచ్ఛత 18 క్యారెట్లు ఉండాలి. చాలామంది రుణదాతలు ఈ స్వచ్ఛత కంటే తక్కువ బంగారాన్ని తాకట్టు పెట్టుకోరు. చాలా బ్యాంకులు గోల్డ్ బార్లపై రుణాలు ఇవ్వవు. ఆభరణాలు, బంగారు నాణేలను తాకట్టు పెట్టొచ్చు. అయితే తనఖా పెట్టినప్పుడు ఆభరణాల్లో భాగమైన వజ్రాలు, రాళ్లకు విలువ ఉండదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కేవలం బంగారం విలువ మాత్రమే లెక్కిస్తారు. నాణేల విషయంలో అధిక స్వచ్ఛత అడగొచ్చు. బరువుపై పరిమితులూ ఉండొచ్చు. చాలామంది 50 గ్రాముల కంటే ఎక్కువ బరువున్న నాణేలను అంగీకరించరు.
ఛార్జీలు..
చాలా వరకు సంస్థలు ముందస్తు రుణ చెల్లింపులపై ఛార్జీలు విధించవు. కొన్ని బ్యాంకులు ఆ ఛార్జీలు విధిస్తున్నప్పటికీ... రుణంలో ఒక శాతంగా మాత్రమే ఉంటాయి. వాల్యుయేషన్ ఛార్జీలు, ప్రాసెసింగ్ ఫీజులు కూడా ఉండొచ్చు. రుణం తిరిగి చెల్లించే విషయంలో రకరకాల ఆప్షన్లు ఉంటాయి. నెలవారీ వాయిదాల్లో (ఈఎంఐ) చెల్లించొచ్చు. లేదా రుణ కాలపరిమితి ఉన్నంతవరకు వడ్డీని మాత్రమే చెల్లించి, చివర్లో ఒకేసారి మొత్తం రుణం చెల్లించవచ్చు. రుణదాతలు, ముఖ్యంగా ఎన్బీఎఫ్సీలు రుణ మొత్తాన్ని పంపిణీ చేయడానికి ముందు వడ్డీ భాగాన్ని తగ్గిస్తుంటాయి.
తిరిగి చెల్లించకపోతే..?
రుణాన్ని సమయానికి తిరిగి చెల్లించలేకపోతే... రుణదాతలకు మీ బంగారాన్ని విక్రయించే హక్కు ఉంటుంది. అలాగే, బంగారం ధర పడిపోతే, రుణదాత అదనపు బంగారాన్ని తాకట్టు పెట్టాలని మిమ్మల్ని అడగొచ్చు. రుణం- బంగారం విలువ నిష్పత్తిని ఎప్పటికప్పుడు నిబంధనల మేరకు కొనసాగించాలని బ్యాంకులు కోరుతుంటాయి. అంటే, వారి దగ్గరున్న బంగారం విలువ.. మీకు ఇచ్చిన డబ్బు కంటే ఎక్కువగా ఉండాలి.
చివరిగా..: బంగారు రుణాలు సౌకర్యవంతంగా ఉంటాయి. అయితే, మీరు తాత్కాలిక నగదు ప్రవాహ సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు మాత్రమే ఎంచుకోండి. ఇల్లు కొనడం వంటి పెద్ద ఖర్చులకు నిధులు సమకూర్చడానికి తీసుకోవద్దు. రుణ చెల్లింపు గడువు సాధ్యమైనంత తక్కువగా పెట్టుకోండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్‌తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్‌గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి