Bank Loans: పాత కారు కొంటున్నారా?

పాత కారు కొనాలని అనుకుంటున్నారా? దీనికోసం రుణం తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? ఇప్పుడు చాలా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఈ కార్లకూ రుణం ఇస్తున్నాయి. కాకపోతే కొన్ని నిబంధనలను మనం అర్థం చేసుకోవాలి.

Published : 14 Jun 2024 00:32 IST

పాత కారు కొనాలని అనుకుంటున్నారా? దీనికోసం రుణం తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? ఇప్పుడు చాలా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఈ కార్లకూ రుణం ఇస్తున్నాయి. కాకపోతే కొన్ని నిబంధనలను మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే రుణ దరఖాస్తు తిరస్కరించకుండా కారు కొనేందుకు అవసరమైన అప్పు లభిస్తుంది.

క్కువ క్రెడిట్‌ స్కోరు ఉండటం చాలా సందర్భాల్లో కొత్త రుణాలు రాకుండా అడ్డుకుంటుంది. కాబట్టి, కారు కొనేందుకు మీరు రుణం తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నప్పుడు ముందుగా మీ స్కోరు ఎంతుందో తెలుసుకునే ప్రయత్నం చేయండి.

ఒకవేళ స్కోరు తక్కువగా ఉండి, రుణం ఇవ్వడానికి తిరస్కరించే అవకాశం ఉందని భావిస్తే.. కొన్ని రోజులు మీ నిర్ణయాన్ని వాయిదా వేయండి. మీ ఈఎంఐలను క్రమం తప్పకుండా చెల్లించండి. కొత్తగా అప్పులను తీసుకునేందుకు బ్యాంకులను సంప్రదించకూడదు.

  • ఆదాయంతో పోలిస్తే రుణాలు అధిక నిష్పత్తిలో ఉన్నప్పుడూ కొత్త అప్పు రాకపోవచ్చు. మీరు ఇప్పటికే ఆర్థికంగా చిక్కుల్లో ఉన్నారని రుణ సంస్థలు భావిస్తాయి.

మీ రుణ నిష్పత్తిని తగ్గించుకునేందుకు ఇప్పటికే ఉన్న అప్పులను చెల్లించండి. ముందుగా అధిక వడ్డీ ఉన్న వాటిని వదిలించుకోండి.

  • ప్రతి ఆర్థిక సంస్థ నిర్ణీత మొత్తంలో ఆదాయం ఉన్న వారికే అప్పులు ఇస్తామని ముందుకు వస్తుంది. ఇలాంటప్పుడు మీ ఆదాయం సరిపోయేంత లేకపోతే రుణం రాకపోవచ్చు. 

మీకు స్థిరమైన ఆదాయం ఉన్నట్లు రుజువులను బ్యాంకు/ఎన్‌బీఎఫ్‌సీకి అందించండి. అదనపు ఆదాయాలు ఉంటే వాటిని పరిగణనలోకి తీసుకోవాలని చెప్పండి. మీ దరఖాస్తును తిరస్కరించకుండా అవసరమైతే సహ దరఖాస్తుదారు మద్దతు తీసుకోండి.

  • పాత కారు కోసం మీరు తక్కువ మొత్తం (డౌన్‌ పేమెంట్‌) చెల్లించి, రుణం అధికంగా కోరినప్పుడు బ్యాంకులు సహజంగానే ఆ దరఖాస్తును తిరస్కరించే అవకాశం ఉంది. 

లోన్‌ మొత్తం తక్కువగా ఉండేలా చూసుకుంటూ, సొంతంగా కాస్త అధికంగా చెల్లిస్తే రుణ దరఖాస్తు ఆమోదం పొందుతుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని