Life insurance: పన్ను ఆదా కోసం జీవిత బీమా కొనుగోలు చేస్తున్నారా?
పాలసీలను కొనుగోలు చేసేటప్పుడు పన్ను మాత్రమే కాకుండా ఈ కింది అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.
ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా ప్రతి ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో బీమా ఎక్కువగా అమ్ముడవుతుంటాయి. దీనికి కారణం చాలా మంది పన్ను చెల్లింపుదారులు.. పన్ను తగ్గించుకోవడం కోసం చివరి నిమిషంలో బీమా పాలసీల్లో పెట్టుబడి పెడుతుంటారు. ఈ విధంగా చేయడం వల్ల పన్ను మాట పక్కన పెడితే.. పాలసీలు ఏమాత్రం అనుకూలంగా ఉండకపోగా ఎక్కువ ఖరీదైనవిగా మారతాయి. అందువల్ల పాలసీలను కొనుగోలు చేసేటప్పుడు పన్ను మాత్రమే కాకుండా ఈ కింది అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
కవరేజీ..
‘జీవిత బీమా’ అనే పదం వివిధ రకాల పాలసీలకు ఉపయోగిస్తుంటారు. ఇందులో టర్మ్, ఎండోమెంట్, మనీబ్యాక్, యులిప్ ఇలా చాలా రకాలు ఉంటాయి. మీరు కుటంబ ఆర్థిక భద్రత కోసం జీవిత బీమా కొనుగోలు చేస్తున్నట్లయితే తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజీ లభించే పాలసీల కోసం చూడాలి. వార్షిక ఆదాయానికి కనీసం 10 రెట్లు లేదా కుటుంబ నెలవారీ ఖర్చులకు కనీసం 300 రెట్లు సమానమైన కవరేజీని పొందగలిగే పాలసీ ఉండాలి. అప్పుడే ఏదైనా దురదృష్టమైన సంఘటన జరిగితే, జీవిత బీమా పాలసీ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తుంది.
బీమా, పెట్టుబడుల కలయికతో వద్దు..
కొన్ని జీవిత బీమా పాలసీలు బీమా, పెట్టుబడుల కలయికతో వస్తాయి. ఎండోమెంట్, మనీబ్యాక్, యులిప్ పాలసీలను ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఈ పాలసీలలో బీమా కవరేజీకి ఎక్కువ ప్రాధాన్యం ఉండదు. బీమా ప్రీమియంకు చాలా తక్కువ మొత్తం కేటాయించి, మిగిలినది ఇతర పథకాల్లో పెట్టుబడి పెడుతుంటాయి. బోనస్‌లు, గ్యారెంటీ జోడింపులతో ఆకర్షిస్తుంటాయి. అయితే ఇవన్నీ జోడించినా కూడా రాబడి సాధారణంగా 5-6% కంటే ఎక్కువ ఉండదు. కాబట్టి అటు బీమా హామీ విషయంలో గానీ, ఇటు రాబడి విషయంలో గానీ ఎక్కువ ప్రయోజనం పొందలేరు.
ఏక మొత్తంగా లేదా విడతలుగా హామీ మొత్తం..
బీమా చేసిన వ్యక్తి మరణిస్తే.. మరణ ప్రయోజనాన్ని నామినీకి అందిస్తారు. ఒకవేళ పాలసీ కాలవ్యవధి పూర్తయ్యే వరకు పాలసీదారుడు జీవించి ఉంటే.. మెచ్యూరిటీ ప్రయోజనాలను చెల్లిస్తారు. పాలసీ ప్రయోజనాలు ఎప్పుడు, ఏవిధంగా (ఏక మొత్తంగా, విడతలుగా) చెల్లిస్తారో తెలుసుకోవడం ముఖ్యం. హామీ మొత్తం ఒకేసారి, నెలవారీ పొందొచ్చు లేదా పిల్లల విద్య, వివాహం వంటి ముఖ్యమైన సందర్భాల్లో అందేలా ఏర్పాటు చేసుకోవచ్చు.
సరెండర్ విలువ..
పాలసీ మెచ్యూరిటీ కంటే ముందే, పాలసీ స్వచ్ఛందంగా వెనక్కి ఇచ్చేస్తే పొందే మొత్తాన్ని సరెండర్ విలువ అంటారు. అన్ని రకాల పాలసీలకు ఈ సౌకర్యం ఉండదు. అలాగే పాలసీని అనుసరించి, బీమా సంస్థను అనుసరించి సరెండర్ విలువ మారుతుంటుంది. పాలసీ తీసుకునేటప్పుడే సరెండర్ విలువను తెలుసుకోవాలి.
పన్ను దాటి అవసరాలకు అనుగుణంగా పాలసీ..
జీవిత బీమా పాలసీకి చెల్లించే ప్రీమియంపై పన్ను ఆదా చట్టం 80సి కింద రూ.1.50 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. అయితే సెక్షన్ 80సి కిందకి పీపీఎఫ్, ఎస్‌ఎస్‌వై, ఈపీఎఫ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, ఎన్‌పీఎస్, గృహ రుణ అసలు చెల్లింపులు వంటివి కూడా వస్తాయి. కాబట్టి జీవిత బీమా కొనుగోలులో పన్ను మినహాయింపు అదనపు ప్రయోజనంగా మాత్రమే చూడాలి.
చివరిగా..
జీవిత బీమా కొనుగోలు చేసేటప్పుడు ప్యూర్ టర్మ్ పాలసీకి ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. దీంతో తక్కువ ప్రీమియంతో ఎక్కువ హామీ మొత్తం పొందొచ్చు. అలాగే ప్రీమియంపై పన్ను ఆదా చేసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడితే దీర్ఘకాలంలో 10-12% రాబడిని కూడా పొందొచ్చు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Boycott Culture: ‘బాయ్‌కాట్’ మంచి పద్ధతి కాదు..!: కేంద్ర మంత్రి ఠాకూర్
-
Sports News
Women T20 World Cup: మహిళా సభ్యులతో తొలిసారిగా ప్యానెల్..భారత్ నుంచి ముగ్గురికి చోటు
-
India News
Goa: ఆస్తి వివాదం.. గోవాలో ఫ్రెంచ్ నటి నిర్బంధం..!
-
Technology News
Indus Royal Game: వీర్లోక్లో మిథ్‌వాకర్స్ పోరాటం.. దేనికోసం?
-
India News
SA Bobde: ‘సంస్కృతం ఎందుకు అధికార భాష కాకూడదు..?’ మాజీ సీజేఐ బోబ్డే
-
General News
‘ట్విటర్ పే చర్చా..’ ఆనంద్ మహీంద్రా, శశి థరూర్ మధ్య ఆసక్తికర సంభాషణ!