Ashok Leyland: పాత వాహనాల కోసం అశోక్‌ లేల్యాండ్‌ ఇ-మార్కెట్‌ ప్లేస్‌

Ashok Leyland: హిందూజా గ్రూప్‌నకు చెందిన వాహన తయారీ సంస్థ అశోక్‌ లేల్యాండ్‌ కమర్షియల్‌ వెహికల్‌ సెగ్మెంట్‌ కోసం ఇ-మార్కెట్‌ ప్లేస్‌ తీసుకొచ్చింది.

Published : 15 Apr 2023 18:47 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పాత వాణిజ్య వాహనాల మార్పిడి కోసం హిందుజా గ్రూప్‌నకు చెందిన అశోక్‌లే ల్యాండ్‌ (Ashok Leyland) సంస్థ కొత్త ఇ-మార్కెట్‌ప్లేస్‌ను అందుబాటులోకి తెచ్చింది. ‘Re-AL’ పేరిట దీన్ని తీసుకొచ్చినట్లు అశోక్‌ లేల్యాండ్‌ ప్రకటించింది. కస్టమర్లు తమ పాత వాహనాలను మార్చుకోవటానికి ఇ-మార్కెట్‌ స్పేస్ ఉపయోగకరంగా ఉంటుందని తెలిపింది. తమ పాత వాహనాల వివరాలను ఇ-మార్కెట్‌ స్పేస్‌లో నమోదుచేసుకొని సులభంగా  అశోక్‌ లేల్యాండ్‌కు చెందిన బస్సులు, ట్రక్కులకు కొనుగోలు చేయవచ్చని తెలిపింది.

‘‘పాత వాణిజ్య వాహనాల పరిశ్రమ అవాంతరాలు ఎదుర్కొంటోంది. వాటిని నివారించటం కోసమే ఈ డిజిటల్‌ వేదికను తీసుకొచ్చాం. దీని ద్వారా కస్టమర్ల సందేహాలు పరిష్కరిస్తాం. వారు తెలిపిన సమాచారం ప్రకారం వాహనానికి మంచి విలువను నిర్ణయిస్తాం. మా డిజిటల్ ప్రయణంలో ఇదొక ముందడుగు’’ అని అశోక్‌ లేల్యాండ్‌ ఎండీ, సీఈఓ షేను అగర్వాల్‌ తెలిపారు. ‘మా ఇ-మార్కెట్‌ప్లేస్‌లో కస్టమర్లకు తమ పాత వాహనాల రీసేల్‌కు మంచి విలువ దొరుకుతుంది. తమ పాత వాహనాలకు బదులు అశోక్ లేల్యాండ్ కొత్త ట్రక్కులు, బస్సులుగా మార్చుకోవటానికి సహాయపడుతుంది’ అని సంస్థ అధ్యక్షుడు సంజీవ్‌ కుమార్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని