AVTR 4825: నిర్మాణ, మైనింగ్‌ అవసరాల కోసం అశోక్‌ లేల్యాండ్‌ కొత్త టిప్పర్‌

నిర్మాణ, మైనింగ్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకొని హిందుజా గ్రూప్‌నకు చెందిన వాహన తయారీ సంస్థ అశోక్‌ లేల్యాండ్‌ ఏవీటీర్‌ 4825 టిప్పర్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది...

Published : 19 Aug 2022 18:28 IST

చెన్నై: నిర్మాణ, మైనింగ్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకొని హిందుజా గ్రూప్‌నకు చెందిన వాహన తయారీ సంస్థ అశోక్‌ లేల్యాండ్‌ ఏవీటీర్‌ 4825 పేరిట కొత్త టిప్పర్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. దీంట్లో హెచ్‌6 ఇంజిన్‌ను అమర్చారు. వినియోగదారుల అవసరాలను బట్టి వివిధ క్యాబిన్‌, బాడీ ఆప్షన్లతో వాహనాన్ని రూపొందించినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. 19-55 టన్నుల ‘గ్రాస్‌ వెహికల్‌ ఆఫ్‌ వెయిట్‌ (GVW)’ పోర్ట్‌ఫోలియోలో ఇది అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. 250 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన హెచ్‌ సిరీస్‌ 4వీ 6-సిలిండర్‌ ఇంజిన్‌తో టిప్పర్‌ వస్తోందని తెలిపారు. దీంట్లో ఉన్న ఐ-జెన్‌6 సాంకేతికత వల్ల ఇంజిన్‌ పనితీరు మరింత మెరుగవుతుందని వెల్లడించారు. ఎత్తైన ప్రదేశాలు, కొండల్లో సైతం అధిక లోడ్‌తోనూ ఈ వాహనం వేగంగా ప్రయాణించగలదని తెలిపారు. దీనివల్ల ఉత్పాదకత పెరుగుతుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని