Published : 17 May 2022 12:59 IST

అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న (Vs) నేష‌న‌ల్ పెన్ష‌న్ స్కీమ్‌

నేష‌న‌ల్ పెన్ష‌న్ స్కీమ్‌ (ఎన్‌పీఎస్‌) అనేది కాంట్రిబ్యూష‌న్ పెన్ష‌న్ ప్లాన్ అయితే, అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న (ఏపీవై) అనేది బెనిఫిట్ పెన్ష‌న్ ప్లాన్‌గా నిర్వ‌హించ‌బ‌డింది. `ఏపీవై, ఎన్‌పీఎస్‌` రెండూ దాని నియ‌మాలు, మార్గ‌ద‌ర్శ‌కాల‌కు సంబంధించినంత‌వ‌ర‌కు `పెన్ష‌న్ ఫండ్ రెగ్యులేట‌రీ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ` (PFRDA)చే నియంత్రించ‌బ‌డ‌తాయి. ఈ రెండు ప‌థ‌కాలు మ‌న‌లో చాలా మంది ప‌ద‌వీ విర‌మ‌ణ కోసం ఆదా చేయ‌డానికి పెట్టుబ‌డి పెట్టే రెండు పెన్ష‌న్ ప‌థ‌కాలు. `ఏపీవై, ఎన్‌పీఎస్‌` ఖాతాను తెరిచిన త‌ర్వాత జీవిత‌కాల యాన్యుటీని అందించ‌డం ద్వారా పెన్ష‌న్ ప‌థ‌కంగా మారుస్తుంది. ఈ రెండు ప‌థ‌కాలు కూడా వాయిదా వేయ‌బ‌డిన పెన్ష‌న్ ప‌థ‌కాలు, అంటే సాధార‌ణ పెన్ష‌న్ పొంద‌డానికి ముందు ఒక నిర్దిష్ట కాల‌వ్య‌వ‌ధికి డ‌బ్బులు చెల్లిస్తూ ఉండాలి.

అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న‌( ఏపీవై)లో ఖాతా తెరిచినప్పుడే క‌నీస హామీ పెన్ష‌న్ ఎంతో తెలుస్తుంది. `ఎన్‌పీఎస్` అనేది స్వ‌చ్ఛంధంగా నిర్వ‌చించ‌బ‌డిన స‌హ‌కార ప‌ద‌వీ విర‌మ‌ణ పొదుపు ప‌థ‌కం `ఏపీవై`కి భిన్నంగా ఉంటుంది. ఎన్‌పీఎస్‌లో వృద్ధికి హామి లేదు,  పెన్ష‌న్ ఎంత వ‌స్తుంద‌ని ఖ‌చ్చితంగా తెలియ‌దు. చందాను.. ఈక్విటీలు, డెట్ లేదా రెండింటి మిశ్ర‌మంలో పెట్టుబ‌డి పెట్ట‌బ‌డ‌తాయి. ఎన్‌పీఎస్ అనేది మార్కెట్‌-లింక్డ్ పెన్ష‌న్ ప‌థ‌కం, దీనిలో ఒక‌రు ఆదా చేసే మొత్తాన్ని బట్టి, మార్కెట్ రాబ‌డుల‌ను బ‌ట్టి పెన్ష‌న్ మొత్తం నిర్ణయించ‌బ‌డుతుంది.

`ఏపీవై` కింద చందాదారుల చెల్లించిన డ‌బ్బుని బ‌ట్టి 60 సంవ‌త్స‌రాల వ‌య‌స్సులో నెల‌కు రూ. 1,000, రూ. 2,000, రూ. 4,000, రూ. 5,000 క‌నీస హామీ పెన్ష‌న్ ఇవ్వ‌బ‌డుతుంది. `ఎన్‌పీఎస్‌`లో మెచ్యూరిటీపై సేక‌రించిన నిధి, ఆ స‌మ‌యంలో ఉన్న యాన్యుటీ రేట్ల ఆధారంగా ఎన్‌పీఎస్ చందాదారునికి పెన్ష‌న్ మొత్తం నిర్ణ‌యించ‌బ‌డుతుంది. `ఏపీవై`లో రాబ‌డి దాదాపు 8% ఉంటుంది. హామీ పెన్ష‌న్ చందాదారునికి స్థిరంగా ఉంటుంది. మెచ్యూరిటీ స‌మ‌యంలో రాబ‌డి రేటు 8% కంటే ఎక్కువ‌గా ఉంటే అధిక ఆదాయాల అవ‌కాశం కూడా అందిస్తుంది. గ‌రిష్ట పెన్ష‌న్ `ఏపీవై` విష‌యంలో, మీరు ఆదా చేసే మొత్తాన్ని బ‌ట్టి స్థిర‌మైన పెన్ష‌న్ మొత్తం ఉంటుంది.  కానీ ఇది ప‌రిమిత పెట్టుబ‌డితో వ‌స్తుంది, పెన్ష‌న్ మొత్తంపై ప‌రిమితిని క‌లిగి ఉంటుంది.

`ఏపీవై` అర్హ‌తః 18-40 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న అర్హ‌తగ‌ల (అసంఘ‌టిత రంగంలో ప‌నిచేసే) భార‌త‌దేశ పౌరులంద‌రికీ అటల్ పెన్ష‌న్ యోజ‌నలో చందాదారులుగా న‌మోదు కావ‌చ్చు. ఈ చందాకు బ్యాంక్ ఖాతా త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి. చందాదారులు నెల‌వారీ, త్రైమాసిక‌, అర్ధ వార్షిక ప్రాతిప‌దిక‌న ఈ పెన్ష‌న్ స్కీమ్‌కి చందా ఇవ్వ‌వ‌చ్చు. చందాదారులు కొన్ని ష‌ర‌తుల‌కు లోబ‌డి స్వ‌చ్ఛందంగా ఈ స్కీమ్ నుండి కూడా నిష్క్ర‌మించ‌వ‌చ్చు.

60 ఏళ్ల అనంత‌రం నెల‌వారీ పెన్ష‌న్ చందాదారునికి అందుబాటులో ఉంటుంది. పెన్ష‌న్ తీసుకునే వ్య‌క్తి త‌ర్వాత అత‌ని జీవిత భాగ‌స్వామికి  పెన్ష‌న్ తీసుకునే వ్య‌క్తి మ‌ర‌ణానంత‌రం చందాదారుని 60 ఏళ్ల వ‌య‌స్సు వ‌ర‌కు సేక‌రించ‌బ‌డిన పెన్ష‌న్ నిధి, చందాదారుని నామినీకి తిరిగి ఇవ్వ‌బ‌డుతుంది.

`ఎన్‌పీఎస్` అర్హ‌త : 18-70 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న ఎవ‌రైనా ఎన్‌పీఎస్ ఖాతాను తెర‌వ‌వ‌చ్చు. ఇంత‌కు ముందు ఎన్‌పీఎస్ ఖాతాల‌ను మూసివేసిన చందాదారులు పెరిగిన వ‌య‌స్సు అర్హ‌త నిబంధ‌న‌ల ప్ర‌కారం కొత్త ఎన్‌పీఎస్ ఖాతాను తెర‌వ‌డానికి అనుమ‌తించ‌బ‌డ‌తారు. ఎన్‌పీఎస్‌లో పెట్టుబ‌డి పెట్టే మొత్తం కూడా ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌తో వ‌స్తుంది. ప‌న్నును ఆదా చేయ‌డానికి సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు స‌హాయ‌ప‌డుతుంది.

అయితే `ఎన్‌పీఎస్‌`లో రాబ‌డి ఈక్విటీ, డెట్ వంటి అంత‌ర్లీన ఆస్తుల ప‌నితీరుతో ముడిప‌డి ఉంటుంది. ఎన్‌పీఎస్‌లో జీవిత బీమా కంపెనీ నుండి యాన్యుటీని కొనుగోలు చేయ‌డానికి ఉప‌యోగించే మొత్తంపై పెన్ష‌న్ మొత్తం ఆధార‌ప‌డి ఉంటుంది.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts