Published : 16 Mar 2022 14:30 IST

ATF price hike: రూ.లక్ష దాటిన విమాన ఇంధన ధర

కిలోలీటర్‌పై ఒకేసారి రూ.17 వేల పెంపు

దిల్లీ: దేశంలో విమాన ఇంధన (ఏటీఎఫ్‌) ధర ఏకంగా 18 శాతం పెరిగి జీవనకాల గరిష్ఠాలకు చేరింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో, చమురు మార్కెటింగ్‌ సంస్థలు ఏటీఎఫ్‌ ధరలను మళ్లీ పెంచాయి. ఈ ఏడాదిలో ఏటీఎఫ్‌ ధర పెరగడం ఇది ఆరోసారి. దిల్లీలో ఏటీఎఫ్‌ ధర కిలోలీటరుకు రూ.17,135.63 (18.33 శాతం) పెరిగి రూ.1,10,666.29కు చేరింది.

గతవారం అంతర్జాతీయంగా చమురు బ్యారెల్​ ధర రికార్డు స్థాయిలో 140 డాలర్లకు పెరిగింది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో విమాన ఇంధన ధరలను కూడా పెంచాల్సి వచ్చిందని పరిశ్రమల వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు ఏటీఎఫ్ ధర 50 శాతం పెరగడం గమనార్హం.

విమాన నిర్వహణలో దాదాపు 40 శాతం వాటా వ్యయం ఇంధనానిదే. 2008 ఆగస్టులో అంతర్జాతీయంగా ముడిచమురు ధర బ్యారెల్‌ 147 డాలర్లను తాకింది. అప్పుడు కిలోలీటర్‌ ఏటీఎఫ్‌ ధర రూ.71028.26గా ఉండేది. ప్రస్తుతం ముడిచమురు బ్యారెల్‌ ధర 100 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల ఆధారంగా ఏటీఎఫ్‌ ధరను 15 రోజులకొకసారి సవరిస్తుంటారు. 2022 జనవరి 1 నుంచి ప్రతి 15 రోజులకు వీటి ధరలు పెరుగుతూ వస్తున్నాయి.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని