ATF: విమాన ఇంధన ధర.. కిలోలీటర్‌పై రూ.20,000 పెంపు

దేశంలో విమాన ఇంధనం ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్‌(ఏటీఎఫ్) ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి.

Updated : 16 Jun 2022 16:26 IST

దిల్లీ: దేశంలో విమాన ఇంధనం ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్‌(ఏటీఎఫ్) ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 16 శాతం పెరిగి, ఆకాశన్నంటుతున్నాయి. ఈ మేరకు చమురు సంస్థలు గురువారం నోటిఫికేషన్ విడుదల చేశాయి. ఈ రోజు నుంచే ఈ ధరలు అమల్లోకి వస్తాయి. ఈ రికార్డు స్థాయి ఇంధన ధరతో విమాన టికెట్‌ ధరలు పెరగడం అనివార్యంగా కనిపిస్తోంది. ప్రస్తుతం దేశరాజధాని దిల్లీలో ఈ ధర కిలోలీటరుకు రూ.19,757.13(16.26 శాతం)పెరిగి, 1,41,232.87 కి చేరింది. ఆయా రాష్ట్రాల్లో స్థానికంగా ఉన్న పన్నులను బట్టి ఈ ధరల్లో మార్పులు ఉంటాయి. 

విమాన ఇంధన ధర కిలోలీటరుకు..

కోల్‌కతా ... రూ.1,46,322.23 
ముంబయి ... రూ.1,40,092.74
చెన్నై ... రూ.1,46,215.85

ఇదిలా ఉంటే ఈ నెల ప్రారంభంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ ధరల్ని తగ్గించింది. ఈ ఏడాదిలో తగ్గింపు అదే తొలిసారి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు దేశీయంగా ప్రభావం చూపుతుంటాయి. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైన తర్వాత సరఫరా సమస్యలు తలెత్తి ధరలు మరింత ఎగబాకాయి. భారత్‌ చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. విమానయాన వ్యయాల్లో 40 శాతం వాటా ఇంధనానిదే. దీంతో ఇంధన ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం విమాన ప్రయాణాలపై ఉంటుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని