Ather: ఏథర్‌ కొత్త మైలురాయి.. లక్ష వాహనాల ఉత్పత్తి

ప్రముఖ విద్యుత్‌ స్కూటర్ల తయారీ సంస్థ ఏథర్‌ (Ather) ఎనర్జీ రికార్డు స్థాయిలో వాహనాలను ఉత్పత్తి చేసింది. ఈ ఏడాది జనవరిలో లక్షకు పైగా ఎలక్ట్రిక్‌ స్కూటర్లను తయారు చేసినట్లు తెలిపింది.

Published : 01 Feb 2023 19:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ విద్యుత్‌ స్కూటర్ల తయారీ సంస్థ ఏథర్‌ (Ather) ఎనర్జీ రికార్డు స్థాయిలో వాహనాలను ఉత్పత్తి చేసింది. ఈ ఏడాది జనవరిలో లక్షకు పైగా ఎలక్ట్రిక్‌ స్కూటర్లను తయారు చేసినట్లు తెలిపింది. విద్యుత్‌ ద్విచక్ర వాహనాలపై ఆదరణ పెరగటంతో తయారీ రంగంలో వృద్ధి సాధించగలిగామని పేర్కొంది. సరికొత్త మైలురాయిని చేరుకోవటంపై కంపెనీ సీఈఓ తరుణ్‌ మెహతా ఆనందం వ్యక్తం చేశారు. 

గత కొన్ని నెలలుగా ఏథర్ విద్యుత్‌ వాహనాలు రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్నాయి. గతేడాది ఆగస్టులో ఏకంగా 50 వేల ఏథర్‌ విద్యుత్‌ వాహనాలు విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. మరోవైపు విద్యుత్‌ వాహనాల విక్రయాలు దేశీయంగా పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఇందుకు తోడ్పాటునందిస్తోంది. మరిన్ని కంపెనీలు ఈ రంగంలోకి అడుగు పెట్టే అవకాశం ఉంది. అత్యాధునిక హంగులు, సరికొత్త ఫీచర్లతో అనేక రకాల బ్రాండ్లు అందుబాటులో ఉండటంతో విద్యుత్‌ వాహనాలు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని