Ather Energy: ఏడాది చివరికల్లా 2,500 ఛార్జింగ్‌ స్టేషన్లు: ఏథర్‌

Ather Energy on charging stations: ఛార్జింగ్‌ స్టేషన్లను మరింత విస్తరించనున్నట్లు ఏథర్‌ ఎనర్జీ తెలిపింది. ఏడాది చివరికల్లా 2,500 ఛార్జింగ్‌ కేంద్రాలను నెలకొల్పనున్నట్లు పేర్కొంది.

Published : 16 Feb 2023 20:31 IST

దిల్లీ: విద్యుత్‌ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఏథర్‌ ఎనర్జీ (Ather Energy) ఛార్జింగ్‌ స్టేషన్లను మరింత విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఏడాది చివరికల్లా దేశవ్యాప్తంగా 2,500 ఛార్జింగ్‌ స్టేషన్లను (charging stations) నెలకొల్పనున్నట్లు నిర్ణయించింది. ఇప్పటికే 80 నగరాల్లో వెయ్యికి పైగా ఫాస్ట్‌ ఛార్జింగ్‌ స్టేషన్లు కలిగి ఉన్న ఆ సంస్థ ఈ సంఖ్యను భారీగా పెంచనుంది.

ప్రస్తుతం దేశంలోని టైర్‌-2, టైర్‌-3 నగరాల్లో ఉన్న ఈవీ టూవీలర్‌ ఛార్జింగ్‌ స్టేషన్లలో ఒక్క ఏథర్‌కే 60 శాతం ఫాస్ట్‌ ఛార్జింగ్‌ నెట్‌వర్క్‌ ఉందని ఆ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.విద్యుత్‌ వాహనాలను అందిపుచ్చుకోవడంలో ఛార్జింగ్‌ మౌలిక సదుపాయాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపింది. అందుకే ఛార్జింగ్‌ సదుపాయాల విస్తరణపై దృష్టి సారించినట్లు ఏథర్‌ ఎనర్జీ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ రణ్వీత్‌ తెలిపారు. ప్రస్తుతం 80 నగరాల్లో ఏథర్‌ కార్యకలాపాలు నిర్వహిస్తుండగా.. ఈ ఏడాది మార్చి నాటికి 100 నగరాల్లో 150 కేంద్రాలకు విస్తరించాలని నిర్ణయించినట్లు తెలిపింది. జనవరిలో 12,419 విద్యుత్‌ వాహనాలను విక్రయించినట్లు వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని