FD rates: ఎఫ్‌డీ రేట్లను పెంచిన ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌

బ్యాంకు రిటైల్ డిపాజిట్ల‌పై 60 బేసిస్ పాయింట్ల వ‌ర‌కు పెంచింది.

Updated : 13 Oct 2022 12:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ వ‌డ్డీ రేట్ల‌ను పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. బ్యాంకు రిటైల్ డిపాజిట్ల‌పై 60 బేసిస్ పాయింట్ల వ‌ర‌కు పెంచింది. సాధార‌ణ ఖాతాదారులు 15 రోజుల డిపాజిట్‌పై 3.75%, 45 నెల‌ల ఎఫ్‌డీపై గ‌రిష్ఠంగా 7.50% వ‌డ్డీను పొందొచ్చు. సీనియ‌ర్ సిటిజ‌న్లు ఇదే కాల వ్య‌వ‌ధుల‌కు క‌నిష్ఠంగా 4.25% నుంచి గ‌రిష్ఠంగా 8% వ‌ర‌కు వ‌డ్డీ పొందొచ్చు. రూ.2 కోట్లలోపు ఉన్న డిపాజిట్ల‌పై ఈ వ‌డ్డీ రేట్లు వ‌ర్తిస్తాయి.

NRE/NROలు రూ. 2 కోట్ల లోపు 45 నెల‌ల ఎఫ్‌డీల‌పై గ‌రిష్ఠంగా 7.45% వ‌ర‌కు వ‌డ్డీ పొందుతారు. నాన్‌-కాలబుల్ (మ‌ధ్య‌లో ఉప‌సంహ‌రించుకోవ‌డానికి వీలు లేని) సాధార‌ణ డిపాజిట్ల‌పై 15 నెల‌ల‌కు 7.20%, 36 నెల‌ల‌కు గ‌రిష్ఠంగా 7.60% వ‌డ్డీను పొందొచ్చు. రూ. 1-2 కోట్ల మ‌ధ్య స్థాయిలో డిపాజిట్లు చేసిన‌వారికి ఈ వ‌డ్డీ రేట్లు వ‌ర్తిస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని