Audi price hike: ఆడీ క్యూ3 మోడల్‌ కార్ల ధరల పెంపు.. మే 1 నుంచి అమల్లోకి

Audi price hike: క్యూ3, క్యూ3 స్పోర్ట్‌బ్యాక్‌ ధరలను 1.6 శాతం పెంచుతున్నట్లు ఆడీ ప్రకటించింది. మే 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి.

Published : 11 Apr 2023 16:18 IST

దిల్లీ: జర్మనీకి చెందిన కార్ల తయారీ సంస్థ ఆడీ తమ క్యూ3 మోడల్‌ కార్ల ధరలను పెంచనుంది. క్యూ3, క్యూ3 స్పోర్ట్‌బ్యాక్‌ ధరలను 1.6 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. మే 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. తయారీ వ్యయాలు పెరగడంతో పాటు కస్టమ్స్‌ సుంకాలు పెరిగిన కారణంగానే ధరల్ని సవరించాల్సి వస్తోందని ఆడీ పేర్కొంది. ఇప్పటికే ఏప్రిల్‌ 1 నుంచి క్యూ8 సెలబ్రేషన్‌, ఆర్‌ఎస్‌5, ఎస్‌5 ధరల్ని 2.4 శాతం పెంచింది.

మరో లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్‌ బెంజ్‌ సైతం ఏప్రిల్‌ 1 నుంచి కార్ల ధరల్ని పెంచింది. మోడల్‌ను బట్టి రూ.2 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు పెంపును అమలు చేసింది. నిర్వహణ, తయారీ వ్యయాలు పెరగడమే దీనికి కారణమని పేర్కొంది. వీటితో పాటు మారుతీ మరిన్ని వాహన తయారీ సంస్థలు సైతం కార్ల ధరల్ని పెంచాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని