Auto Sales: నవంబరులోనూ దూసుకెళ్లిన వాహన విక్రయాలు
వాహన విక్రయాలు నవంబరులోనూ గణనీయంగా పెరిగాయి. దేశీయ గిరాకీ పుంజుకోవడం అందుకు దోహదం చేసింది.
దిల్లీ: నవంబరు నెలలోనూ వాహన విక్రయాలు దూసుకెళ్లాయి. ప్రయాణికుల వాహనాలతో పాటు మధ్యస్థాయి, భారీ వాణిజ్య విక్రయాలు గణనీయంగా పెరిగాయి. దేశీయంగా గిరాకీ పుంజుకోవడం అందుకు దోహదం చేసింది.
☛ దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ మొత్తం 1,59,044 వాహనాలు విక్రయించింది. 2021 నవంబరు నాటి 1,39,184 విక్రయాలతో పోలిస్తే ఇవి 14% అధికం. ఇందులో దేశీయ విక్రయాలు 1,17,791 నుంచి 18 శాతం వృద్ధితో 1,39,306కు చేరాయి. చిన్న కార్ల విభాగంలో ఆల్టో, ఎస్-ప్రెసోల విక్రయాలు 17,473 నుంచి 18,251కు పెరిగాయి. కాంపాక్ట్ కార్లలో బాలెనో, సెలెరియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్, టూర్ ఎస్, వ్యాగన్ఆర్ల విక్రయాలు 57,019 నుంచి 72,844కు చేరాయి. యుటిలిటీ వాహనాలైన బ్రెజా, ఎర్టిగా, ఎస్-క్రాస్, ఎక్స్ఎల్6ల విక్రయాలు 24,574 నుంచి 32,563కి పెరిగాయి. ఎగుమతులు 21,393 నుంచి 19,738 యూనిట్లకి తగ్గాయి.
☛ హ్యుందాయ్ మోటార్ ఇండియా విక్రయాలు నవంబరులో 36 శాతం పెరిగి 64,004 యూనిట్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే నెలలో కంపెనీ 46,910 వాహనాలను విక్రయించింది. దేశీయ అమ్మకాలు 30 శాతం పెరిగి 48,003 యూనిట్లకు చేరాయి. ఎగుమతులు 9,909 యూనిట్ల నుంచి 30 శాతం పెరిగి 16,001 యూనిట్లకు పెరిగాయి.
☛ టాటా మోటార్స్ మొత్తం విక్రయాలు 62,192 నుంచి 21 శాతం పెరిగి 75,478కు చేరాయి. దేశీయ విపణిలో విక్రయాలు 58,073 యూనిట్ల నుంచి 27 శాతం పెరిగి 73,467గా నమోదయ్యాయి. వాణిజ్య వాహన అమ్మకాల్లో 10 శాతం పుంజుకొని 29,053 యూనిట్లకు చేరాయి.
☛ ఇక ద్విచక్ర వాహనాల విషయానికొస్తే.. నవంబర్‌లో హీరో మోటోకార్ప్ విక్రయాలు 12 శాతం మేర పెరిగాయి. మొత్తం 3.90 లక్షల యూనిట్లను విక్రయించిట్లు ఆ కంపెనీ తెలిపింది.
☛ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ఏకంగా 38 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత నెలలో 3.53 లక్షల వాహనాలను విక్రయించినట్లు తెలిపింది. గతేడాది ఇదే సమయంలో ఆ కంపెనీ 2,56,174 వాహనాలను మాత్రమే విక్రయించింది.
☛ టీవీఎస్ మోటార్ విక్రయాలు 2 శాతం పెరగ్గా.. బజాజ్ ఆటో విక్రయాలు 19 శాతం మేర క్షీణించాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Easter Attacks: ‘నన్ను క్షమించండి..’ శ్రీలంక మాజీ అధ్యక్షుడు సిరిసేన
-
India News
Khushbu Sundar: వీల్‌ఛైర్ కోసం 30 నిమిషాలా?.. ఎయిరిండియాపై ఖుష్బూ అసహనం
-
Sports News
PCB: మికీ ఆర్థర్ పాక్ ‘ఆన్లైన్ కోచ్’.. సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువ
-
Technology News
WhatsApp: వాట్సాప్ వీడియో.. ఈ మార్పు గమనించారా..?
-
Movies News
RRR: ఆస్కార్ బరిలో నిలిచిన చిత్రాలను వెనక్కి నెట్టి.. నంబరు 1గా ‘ఆర్ఆర్ఆర్’
-
Politics News
AAP: కర్ణాటకపై ఆప్ గురి: అజెండాపై కసరత్తు.. పార్టీల హామీలపై కౌంటర్!