IPO: త్వరలో మార్కెట్‌లోకి అవెలాన్‌ టెక్నాలజీస్‌ ఐపీఓ

అవెలాన్‌ టెక్నాలజీస్‌ ఐపీఓ 2023, ఏప్రిల్‌ 3న ప్రారంభమయి ఏప్రిల్‌ 6తో ముగియనుంది.

Published : 29 Mar 2023 15:18 IST

ఎలక్ట్రానిక్‌ తయారీ సేవల సంస్థ ‘అవెలాన్‌ టెక్నాలజీస్‌’ 3 రోజుల ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ కోసం 2023, ఏప్రిల్‌ 3న ప్రారంభమవుతుంది. ఏప్రిల్‌ 6న సబ్‌స్క్రిప్షన్‌ ముగుస్తుంది. కంపెనీ ఒక్కో షేర్ ధర రూ.415-436గా నిర్ణయించింది. ఈ ఐపీఓ తాజా ఇష్యూ రూ.320 కోట్లు కాగా.. రూ.545 కోట్ల విలువైన షేర్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద అందుబాటులో ఉండనున్నాయి. ఈ షేర్లు 2023, ఏప్రిల్‌ 18న ప్రముఖ స్టాక్‌ ఎక్స్ఛేంజీ(బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ)లలో లిస్ట్‌ అవుతాయని భావిస్తున్నారు. రూ.865 కోట్లను సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. తాజా ఇష్యూ ద్వారా వచ్చే ఆదాయాన్ని రుణ చెల్లింపులు, మూలధన అవసరాలు, సాధారణ కార్పొరేట్‌ ప్రయోజనాల కోసం ఉపయోగించాలని సంస్థ యోచిస్తోంది. ఈ సంస్థ 2022 ఆర్థిక సంవత్సరానికి రూ.840 కోట్ల ఆదాయాన్ని తన కార్యకలాపాల ద్వారా నమోదు చేసింది. 2022, జూన్‌ 30 నాటికి రూ.1,039 కోట్ల విలువైన ఆర్డర్‌ బుక్‌ను కలిగి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని