ఈఎస్ఐ, ఈపీఎఫ్ఓ లో పెరిగిన చందాదారుల సంఖ్య
సంఘటిత రంగంలో కార్మికులకు ఆరోగ్య సేవలను, కార్మికుల చట్టాన్ని అనుసరించి కొన్ని వర్గాలకు ఆర్ధిక సహాయాన్ని అందించే `ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ)లో ఈ ఏడాది ఏప్రిల్‌లో 12.60 లక్షల మంది కొత్త చందాదారులు చేరారు. స్టాటిస్టిక్స్, ప్రొగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ (ఎంవోఎస్పీఐ) `ఈఎస్ఐసీ`, ఉద్యోగులతో సహా ప్రధాన పథకాల కింద చందాదారుల సంఖ్యపై సమాచారాన్ని ఉపయోగించి సెప్టెంబర్ 2017 నుండి అధికారిక రంగంలో ఉపాధి సంబంధిత గణాంకాలను ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) ఒక చోట చేరుస్తుంది. `ఈఎస్ఐసీ`లో సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా `ఈపీఎఫ్ఓ`లో కూడా సభ్యత్వం ఉండే అవకాశం ఉంది. ఈ ఏప్రిల్‌లో `ఈపీఎఫ్ఓ` నిర్వహించే సామాజిక భద్రత పథకాల్లో 9.20 లక్షల మంది కొంత చందాదారులు చేరారు.
కోవిడ్‌కు ముందు సంవత్సరం 2019-20 చేరిన కొత్త చందాదారుల నెలవారీ సగటు మాదిరిగానే ఈ ఏడాది ఏప్రిల్‌లో 12.6 లక్షల మంది `ఈఎస్ఐ`లో చేరారు. నెలకు రూ. 21,000 వరకు సంపాదిస్తున్న 10 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు పనిచేస్తున్న అన్ని కార్మాగారాలు, ఇతర సంస్థల ఉద్యోగులకు `ఈఎస్ఐ` వర్తిస్తుంది. 1948 ఈఎస్ఐ చట్టం ప్రకారం అసంఘటిత రంగ కార్మికులకు ఈఎస్ఐ సేవలు వర్తించవు. ఈఎస్ఐ పథకంలో యజమాని తన వాటా కింద.. వేతనంలో 3.25%, ఉద్యోగి తన వాటా కింద వేతనంలో 0.75% ఆదాయాన్ని `ఈఎస్ఐసీ`కి చెల్లించాల్సి ఉంది.
2019-20లో ఒక నెలకి సగటున 12.60 లక్షల మంది `ఈఎస్ఐ` పథకంలో చందాదారులుగా చేరారు. అయితే 2020-21లో కోవిడ్ ప్రభావం చేత ఈఎస్ఐ చందాదారులుగా చేరే నెలవారీ సగటు 9.60 లక్షలకి పడిపోయింది. 2వ వేవ్ కొనసాగుతున్న సంవత్సరం 2021-22లో నెలకి సగటున 12.40 లక్షల మంది చందాదారులు `ఈఎస్ఐ`లో చేరారు
ప్రైవేట్ రంగంలో కొత్త ఉద్యోగాల సృష్టి బాగానే ఉన్నట్లు కనిపిస్తుంది. సెప్టెంబర్ 2017 - ఏప్రిల్ 2022 మధ్య కాలంలో మొత్తం 6.60 కోట్ల కొత్త చందాదారులు `ఈఎస్ఐ` పథకంలో చందాదారులుగా చేరారు. ఇదే కాలంలో దాదాపు 5.40 కోట్ల మంది కొత్త చందాదారులు `ఈపీఎఫ్ఓ`లో చేరారు. `ఈఎస్ఐ` సభ్యత్వమున్న కార్మికులకు ఆరోగ్య సేవలు, ఆర్ధిక సహాయాన్ని ఎలా అందిస్తుందో, `ఈపీఎఫ్ఓ` కూడా తన చందాదారులకు ప్రభుత్వ రంగాన ఏ ఆర్ధిక సంస్థ ఇవ్వనంత వడ్డీ రేటును అందిస్తుంది. ప్రస్తుతం 8.1% వడ్డీ రేటును `ఈపీఎఫ్ఓ` అందిస్తుంది. అంతేకాకుండా `ఈపీఎఫ్ఓ` చందాదారులు తాము జమ చేసిన ఫండ్ నుండి రుణాల్ని కూడా తీసుకోవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social Look: మేకప్మ్యాన్ని మెచ్చిన సన్నీ లియోనీ.. విజయ్‌తో అనన్య స్టిల్స్
-
General News
Telangana News: ఎస్ఐ పరీక్షకు 2.25లక్షల మంది హాజరు.. త్వరలోనే ప్రిలిమినరీ ‘కీ’
-
Politics News
Bandi Sanjay: కేసీఆర్.. తెలంగాణ డబ్బులు పంజాబ్‌లో పంచి పెడతారా?: బండి సంజయ్
-
General News
Andhra News: ఉత్తరాంధ్రకు వాయు‘గండం’.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు
-
Politics News
KTR: కేంద్రం నిర్ణయం చేనేత పరిశ్రమకు మరణశాసనమే: కేటీఆర్
-
Sports News
INDw vs AUSw : అమ్మాయిలూ... ప్రతీకారం తీర్చుకోవాలి.. పసిడి పట్టేయాలి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- weekly horoscope :రాశిఫలం ( ఆగస్టు 7 - ఆగస్టు 13)
- Chandrababu-Modi: అప్పుడప్పుడు దిల్లీకి రండి: చంద్రబాబుతో ప్రధాని మోదీ
- Nithya Menen: అతడు నన్ను ఆరేళ్లుగా వేధిస్తున్నాడు.. 30 నంబర్లు బ్లాక్ చేశా: నిత్యామేనన్
- Allu Arjun: కల్యాణ్‌రామ్ అంటే నాకెంతో గౌరవం: అల్లు అర్జున్
- అక్క కాదు అమ్మ.. చెల్లి కాదు శివంగి
- Hyderabad News : తండ్రీ కుమారుడి నుంచి రూ.16.10 కోట్లు కొట్టేశారు
- ఫైర్ కంపెనీ ఉద్యోగికి భయానక పరిస్థితి.. గుండెలు పిండేసే ఘోరం!
- Stomach ulcers: అల్సర్ ఎందుకొస్తుందో తెలుసా..?
- సూర్య అనే నేను...
- నిమిషాల్లో వెండి శుభ్రం!