Axis Bank: రుణ రేట్లు పెంచిన యాక్సిస్‌ బ్యాంక్‌

యాక్సిస్‌ బ్యాంక్‌ రుణ రేట్లు సవరించింది. కొత్త రేట్లు 2023 ఫిబ్రవరి 19 నుంచే అమల్లోకి వచ్చాయని బ్యాంకు తెలిపింది.

Published : 20 Feb 2023 16:45 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రైవేట్‌ రంగానికి చెందిన యాక్సిస్‌ బ్యాంకు నిధుల వ్యయం ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్‌)ను అన్ని కాలవ్యవధులపై 10 బేసిస్ పాయింట్లు (0.10%) మేర పెంచింది. ఈ నెల (2023 ఫిబ్రవరి) 19వ తేదీ నుంచే కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయని బ్యాంకు తెలిపింది.

ఎంసీఎల్‌ఆర్‌ రేటు 0.10% పెరగడంతో జనవరిలో 8.60% ఉన్న ఓవర్‌నైట్‌, ఒక నెల ఎంసీఎల్‌ఆర్‌ 8.70%కు పెరిగింది. అలాగే మూడు నెలల కాలవ్యవధికి 8.70% నుంచి 8.80%కు, ఏడాది కాలవ్యవధికి 8.80% నుంచి 8.90%కు, రెండేళ్ల కాలవ్యవధికి 8.90% నుంచి 9%కు, మూడేళ్ల కాలవ్యవధికి 8.95% నుంచి 9.50%కు ఎంసీఎల్‌ఆర్‌ పెరిగింది. దీంతో (ఎంసీఎల్‌ఆర్‌ ఆధారంగా ఫ్లోటింగ్‌ రేటుతో) గృహ, వాహన, వ్యక్తిగత వంటి అన్ని రకాల రుణాలు తీసుకున్న వ్యక్తుల ఈఎంఐలు పెరగనున్నాయి. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రెపో రేటును పెంచడంతో బ్యాంకులు కూడా రుణ రేట్లను పెంచుతూ వస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని