Fixed deposit rates: ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచిన యాక్సిస్ బ్యాంక్
యాక్సిస్ బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం, కొత్త రేట్లు మే 12, 2022 నుండి అమలులోకి వస్తాయి.
ప్రైవేట్ రంగానికి చెందిన యాక్సిస్ బ్యాంక్ వివిధ కాలపరిమితులు గల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. యాక్సిస్ బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం, కొత్త రేట్లు మే 12, 2022 నుండి అమలులోకి వస్తాయి. బ్యాంక్ సాధారణ ప్రజలకు ఇచ్చే వడ్డీ రేటు కంటే సీనియర్ సిటిజన్లకు మరో 0.50 శాతం అదనపు వడ్డీ ఆఫర్ చేస్తుంది. ఇది అన్ని కాలపరిమితులకు వర్తిస్తుంది. మరోవైపు యాక్సిస్ బ్యాంక్ 7 రోజుల నుంచి మొదలుకుని 10 సంవత్సరాల వరకు వివిధ కాలపరిమితులతో ఫిక్స్డ్ డిపాజిట్లను ఆఫర్ చేస్తుంది. అత్యధికంగా 5 నుంచి 10 సంవత్సరాల కాలవ్యవధి ఉన్న ఎఫ్డీపై 5.75 శాతం వడ్డీని అందిస్తుంది.
రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై యాక్సిస్ బ్యాంక్ సాధారణ ప్రజలకు ఆఫర్ చేస్తున్న వడ్డీ రేట్లు..
* 7 - 29 రోజుల డిపాజిట్లపై ... 2.50 శాతం
* 30 రోజుల నుంచి - 3 నెలల లోపు డిపాజిట్లపై ... 3 శాతం
* 3 - 6 నెలల డిపాజిట్లపై... 3.50 శాతం
* 6 - 9 నెలల డిపాజిట్లపై ... 4.40 శాతం
* 6 - 12 నెలల డిపాజిట్లపై ... 4.75 శాతం
* ఏడాది పైన, ఏడాది 5 రోజుల లోపు డిపాజిట్లపై ... 5.25 శాతం
* ఏడాది 5 రోజుల పైన, ఏడాది 11 రోజుల లోపు ... 5.25 శాతం
* ఏడాది 11 రోజుల పైన, ఏడాది 25 రోజుల లోపు ... 5.25 శాతం
* ఏడాది 25 రోజుల పైన, 15 నెలల లోపు ... 5.25 శాతం
* 15 నెలలు ఆపైన 18 నెలల లోపు డిపాజిట్లపై ..5.30 శాతం
* 18 నెలలు ఆపైనా 2 ఏళ్ల లోపు డిపాజిట్లపై .. 5.30 శాతం
* 2ఏళ్ల నుంచి 3 ఏళ్ళ లోపు డిపాజిట్లపై.. 5.60 శాతం
* 3ఏళ్ల నుంచి 5 ఏళ్ళ లోపు డిపాజిట్లపై.. 5.60 శాతం
* 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల లోపు డిపాజిట్లపై 5.75 శాతం వడ్డీ రేట్లను బ్యాంక్ ఆఫర్ చేస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం