Axis Bank Q3 Results: యాక్సిస్‌ బ్యాంక్ లాభం 62 శాతం వృద్ధి

యాక్సిస్‌ బ్యాంక్ మూడో త్రైమాసిక ఫలితాలను సోమవారం ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే కంపెనీ లాభం 62 శాతం వృద్ధి చెందింది.

Published : 23 Jan 2023 20:02 IST

దిల్లీ: ప్రైవేటు రంగ యాక్సిస్‌ బ్యాంక్ (Axis Bank) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాలను సోమవారం ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో స్టాండలోన్‌ ప్రాతిపదికన రూ.5,853 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,614 కోట్లుగా ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే కంపెనీ లాభం 62 శాతం వృద్ధి చెందింది.

బ్యాంక్‌ మెత్తం ఆదాయం రూ.21,101 కోట్ల నుంచి రూ.26,892 కోట్లకు పెరిగిందని యాక్సిస్‌ బ్యాంక్‌ తెలిపింది. వడ్డీ ద్వారా వచ్చే నికర ఆదాయం 32 శాతం పెరిగి రూ.11,459  కోట్లుగా నమోదయిందని పేర్కొంది. నికర వడ్డీ మార్జిన్ 4.26 శాతంగా ఉందని వెల్లడించింది. స్థూల నిరర్థక ఆస్తులు (NPA) 3.17 శాతం నుంచి 2.38 శాతానికి చేరాయని, నికర నిరర్థక ఆస్తులు 0.91 శాతం నుంచి 0.47 శాతానికి తగ్గినట్టు పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని