Credit Card: ఈ క్రెడిట్‌ కార్డుతో ఏడాదికి ఉచితంగా మూడు విమాన టికెట్లు

Axis bank vistara credit card: తరచూ విమాన ప్రయాణాలు చేసే వారికోసం విస్తారాతో కలిసి యాక్సిస్‌ బ్యాంక్‌ ప్రత్యేక క్రెడిట్‌ కార్డుని ఆఫర్‌ చేస్తోంది.

Updated : 15 Apr 2023 11:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొంత మంది తరచూ విమాన ప్రయాణాలు చేస్తుంటారు. వ్యాపార అవసరాలు లేదా విహార యాత్రలు.. ఇలా ఏదో ఒక అవసరం నిమిత్తం తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంటుంది. అలాంటి వారి కోసం ప్రత్యేక క్రెడిట్‌ కార్డులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని ఉచితంగా విమాన టికెట్లను కూడా ఆఫర్‌ చేస్తున్నాయి. వాటిలో ఒకటి యాక్సిస్‌ బ్యాంక్‌ విస్తారా కార్డ్‌ (Axis bank vistara credit card).

ప్రధానంగా తరచూ ప్రయాణాలు చేసేవారిని దృష్టిలో ఉంచుకొనే యాక్సిస్‌ బ్యాంక్‌.. విస్తారాతో కలిసి ఈ కోబ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డును (Axis bank vistara credit card) తీసుకొచ్చింది. మరి దీంట్లో ప్రయోజనాలు, రివార్డు పాయింట్లు, రుసుములు ఎలా ఉంటాయో తెలుసుకుందాం..

స్వాగత ప్రయోజనాలు..

  • కాంప్లిమెంటరీ ఎకానమీ క్లాస్‌ టికెట్‌ వోచర్‌ను వెలకమ్‌ గిఫ్ట్‌గా ఇస్తారు.
  • వోచర్‌ను కార్డుదారుల క్లబ్‌ విస్తారా ఖాతాకు జత చేస్తారు. జారీ చేసిన దగ్గరి నుంచి మూడు నెలల వరకు పనిచేస్తుంది. జాయినింగ్‌ ఫీజు చెల్లించిన వెంటనే వోచర్‌ను జారీ చేస్తారు.

రివార్డులు..

  • ప్రతి రూ.200 ఖర్చుపై రెండు క్లబ్‌ విస్తారా పాయింట్లు ఇస్తారు. క్లబ్‌ విస్తారా పాయింట్లను విమాన టికెట్ల కొనుగోలు సమయంలో రీడీమ్‌ చేసుకోవచ్చు.
  • క్రెడిట్‌ కార్డు ద్వారా వాలెట్లను రీలోడ్‌ చేస్తే మాత్రం సీవీ పాయింట్లు ఉండవు.

మైల్‌స్టోన్‌ బెనిఫిట్స్‌..

  • నిర్దేశించిన మేర ఖర్చు చేస్తే మైల్‌స్టోన్‌ ప్రయోజనాల కింద 1,000 బోనస్ సీవీ పాయింట్లను ఇస్తారు. అలాగే ప్రతి సంవత్సరం మూడు కాంప్లిమెంటరీ విమాన టికెట్లు కూడా పొందొచ్చు.
  • కార్డు జారీ చేసిన 90 రోజుల్లోపు రూ.50,000 ఖర్చు చేస్తే 1,000 సీవీ పాయింట్లు బోనస్‌ కింద వస్తాయి.
  • రూ.1,25,000 కంటే ఎక్కువ ఖర్చు చేస్తే 1 ఎకానమీ క్లాస్‌ టికెట్‌ వస్తుంది.
  • ఖర్చు రూ.2,50,000 దాటితే మరో ఎకానమీ క్లాస్‌ టికెట్‌ను పొందొచ్చు.
  • రూ.6 లక్షలపైన ఖర్చు చేస్తే 1 ఎకానమీ టికెట్‌ను పొందొచ్చు.
  • ఇలా ఏడాదిలో యాక్సిస్‌ బ్యాంక్‌ విస్తారా కార్డ్‌పై రూ.6 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేస్తే ఉచితంగా మూడు విమాన టికెట్లు పొందొచ్చు.
  • అయితే, ఈ టికెట్లు దేశీయ ప్రయాణాలకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అది కూడా టికెట్లు జారీ అయిన ఆరు నెలల్లోగా వినియోగించుకోవాలి.

ప్రయాణ ప్రయోజనాలు..

  • ప్రతి మూడు నెలలకోసారి రెండు కాంప్లిమెంటరీ డొమెస్టిక్‌ లాంజ్‌లను వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది.
  • కాంప్లిమెంటరీ క్లబ్‌ విస్తారా బేస్‌ మెంబర్‌షిప్‌ను ఉచితంగా ఆఫర్‌ చేస్తారు.

డైనింగ్‌ బెనిఫిట్స్‌..

  • యాక్సిస్‌ బ్యాంక్‌ ఈజీడైనర్‌ ప్రోగ్రాంలో ఉన్న రెస్టరెంట్లలో భోజనం చేస్తే 25 శాతం, గరిష్ఠంగా రూ.800 వరకు రాయితీ పొందొచ్చు.

బీమా ప్రయోజనాలు..

  • కొనుగోళ్లపై రూ.1 లక్ష వరకు బీమా హామీ ఉంటుంది.
  • ట్రావెల్‌ డాక్యుమెంట్లు పొగొట్టుకుంటే 300 డాలర్ల వరకు బీమా రక్షణ లభిస్తుంది.
  • బ్యాగేజ్‌ పోయినా 300 డాలర్లు వరకు ఇన్సూరెన్స్‌ పొందొచ్చు.

అర్హతలు..

  • వయసు 18 నుంచి 70 ఏళ్ల మధ్య ఉండాలి
  • భారత పౌరులై ఉండాలి
  • వార్షికాదాయం రూ.6 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి.

రుసుములు..

  • జాయినింగ్‌ ఫీజు- రూ.1,500 (పన్నులు అదనం)
  • రెన్యువల్‌ ఫీజు- రూ.1,500 (పన్నులు అదనం)
  • విదేశీ కరెన్సీ మార్కప్‌- లావాదేవీ మొత్తంపై 3.5 శాతం
  • వడ్డీరేటు- ఏడాదికి 52.86 శాతం
  • క్యాష్‌ అడ్వాన్స్‌ ఛార్జీ- విత్‌డ్రా చేసిన మొత్తంపై 2.5 శాతం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు