ChatGPT - Ernie: చాట్‌జీపీటీకి పోటీగా ‘ఎర్నీ’.. చైనా బైదూ ప్రకటన

ChatGPT - Ernie: కృత్రిమ మేధతో పనిచేసే చాట్‌బాట్‌ ఎర్నీ (Ernie)ని సెర్చ్‌ సేవల్లోకి మార్చి నుంచి అందుబాటులోకి తేనున్నట్లు బైదూ పేర్కొంది.

Published : 23 Feb 2023 10:25 IST

హాంకాంగ్‌: కృత్రిమమేధ (ఏఐ)తో పనిచేసే చాట్‌జీపీటీ (ChatGPT)కి పోటీగా చాట్‌బాట్‌ ఎర్నీ (Ernie)ని తీసుకురానున్నట్లు చైనా అతిపెద్ద సెర్చింజిన్‌ బైదూ ప్రకటించింది. కృత్రిమ మేధతో పనిచేసే చాట్‌బాట్‌ ఎర్నీ (Ernie)ని సెర్చ్‌ సేవల్లోకి మార్చి నుంచి అందుబాటులోకి తేనున్నట్లు పేర్కొంది. ఈలోపు ఎర్నీ (Ernie) బాట్‌ అంతర్గత పరీక్షలను పూర్తిచేస్తామని కంపెనీ వెల్లడించింది. బైదూకు చెందిన సెర్చ్‌, క్లౌడ్‌ సేవల్లో ఎర్నీ (Ernie) బాట్‌ను సమీకృతం చేశామని బైదూ సీఈఓ రాబిన్‌ లీ తెలిపారు. స్మార్ట్‌ కార్‌ ఆపరేటింగ్‌ వ్యవస్థ, స్మార్ట్‌ స్పీకర్‌కు కూడా దీన్ని కలిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు. ఈ వార్తలతో బుధవారం న్యూయార్క్‌లో ముందస్తు మార్కెట్‌ ట్రేడింగ్‌లో కంపెనీ షేరు 7 శాతం పెరిగి 150 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని