Published : 27 Jun 2022 18:45 IST

Bajaj Auto share buyback: ₹2,500 కోట్ల షేర్ల బైబ్యాక్‌కు బజాజ్‌ ఆటో నిర్ణయం

ముంబయి: ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ బజాజ్‌ ఆటో (Bajaj Auto) షేర్ల బై బ్యాక్‌ను ప్రకటించింది. మొత్తం రూ.2,500 కోట్ల విలువైన షేర్లను ఓపెన్‌ మార్కెట్‌ నుంచి కొనుగోలు చేసేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆ కంపెనీ సోమవారం ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చింది. షేర్ల బైబ్యాక్‌కు (share buyback) బజాజ్‌ ఆటో కొద్ది రోజులే ముందే నిర్ణయించినప్పటికీ.. చర్చల అనంతరం ముందుకు వెళ్లాలని నిర్ణయించడంతో ఆలస్యమైంది. దీంతో సోమవారం బోర్డు సమావేశమై బైబ్యాక్‌ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.

షేర్ల బైక్‌ బ్యాక్‌లో భాగంగా ఒక్కో షేరుకు రూ.4,600 మించకుండా చెల్లించాలని కంపెనీ నిర్ణయించింది. ప్రమోటర్లు, ప్రమోటర్‌ గ్రూపులు, కంపెనీ నియంత్రణలోని వ్యక్తులను దీన్నుంచి మినహాయించారు. కేవలం ఓపెన్‌ మార్కెట్‌ నుంచి మాత్రమే ఈ షేర్లు కొనుగోలు చేయనున్నారు. శుక్రవారం మార్కెట్‌ ముగిసే సమయానికి బజాజ్‌ ఆటో షేరు విలువ రూ.3,812 ఉండగా.. బైబ్యాక్‌ ధర 20.64 శాతం ప్రీమియం కావడం గమనార్హం. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత బజాజ్‌ ఆటో షేర్లను బైబ్యాక్‌ చేస్తోంది.

Also Read: షేర్ల బైబ్యాక్‌ మదుపరులకు లాభమేనా?

బై బ్యాక్‌ ఎందుకు చేస్తారు?

తమ కంపెనీ షేరు వాస్తవిక విలువకన్నా తక్కువకు మార్కెట్లో ఉందని కంపెనీలు భావించినప్పుడు, షేర్‌ ధరకు మద్దతు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటాయి. దీని కోసం కొన్ని కంపెనీలు షేర్ల బైబ్యాక్‌ను ప్రకటిస్తుంటాయి. దీనివల్ల మార్కెట్లో కంపెనీ షేర్ల సంఖ్య తగ్గి, ఉన్న షేర్ల ధరకు మద్దతు లభిస్తుందని మార్కెట్‌ నిపుణులు చెబుతుంటారు. కొన్ని కంపెనీలు తమ వద్ద నిరుపయోగంగా ఉన్న మిగులు మొత్తాల నుంచి వాటాదారులకు ప్రతిఫలం ఇచ్చేందుకు బైబ్యాక్‌ మార్గాన్ని ఎంచుకుంటాయి. కొన్నిసార్లు యాజమాన్య నియంత్రణ వాటా పెంచుకోడానికీ యాజమాన్యాలు రక్షణాత్మకంగా బైబ్యాక్‌ను చేస్తుంటాయి. మార్కెట్‌ ధరతో పోల్చినప్పుడు బైబ్యాక్‌ ధర ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, అధిక ధరకు షేర్లను విక్రయించే అవకాశం లభిస్తుంది. అయితే, బై బ్యాక్‌లోపాల్గొనాలా వద్దా అనేది మదుపరుల ఇష్టం.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని