Updated : 24 Jun 2022 21:10 IST

Pulsar 250: మార్కెట్లోకి కొత్త పల్సర్‌ 250.. బ్లాక్‌ ప్రియుల కోసం ప్రత్యేకం!

ఇంటర్నెట్‌ డెస్క్‌: పల్సర్‌ ప్రియుల కోసం కొత్త బైక్‌లను లాంచ్‌ చేసింది బజాజ్‌ ఆటో. ముఖ్యంగా నలుపు రంగు మెచ్చే వారి కోసం పల్సర్‌ 250 (Pulsar 250) మోడల్‌ బ్లాక్‌ వేరియంట్లను మార్కెట్లోకి విడుదల చేసింది. పల్సర్‌ N250 (నేక్డ్‌ స్ట్రీట్‌ ఫైటర్‌), పల్సర్‌ F 250 (సెమీ ఫెయిర్డ్‌ స్ట్రీట్‌ రేసర్‌) పేరిట తీసుకొచ్చిన ఈ రెండు మోడళ్లూ డ్యూయల్‌ ఏబీఎస్‌తో వస్తున్నాయి. వీటి ధరను రూ.1.50 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్‌ దిల్లీ) నిర్ణయించినట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. సింగిల్‌ ఏబీఎస్‌ వేరియంట్‌ మోడళ్లు వివిధ రంగుల్లో లభ్యమవుతాయని కంపెనీ తెలిపింది.

ఈ రెండు మోడళ్లలోనూ (N 250, F250) 300ఎంఎం ఫ్రంట్‌, 230 ఎంఎం రియర్‌ డిస్క్‌ బ్రేకులను అమర్చారు. గ్రిప్‌ కోసం వెడల్పాటి టైర్లు ఇచ్చినట్లు బజాజ్‌ పేర్కొంది. వాహనదారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని పల్సర్‌250లో డ్యూయల్‌ ఛానెల్‌ ఏబీఎస్‌ను అందిస్తున్నామని బజాజ్‌ ఆటో ప్రెసిడెంట్‌ (మోటార్‌ సైకిల్‌ బిజినెస్‌) సారంగ్‌ కనడే తెలిపారు. ముఖ్యంగా నలుపు రంగుకు ఉన్న డిమాండ్‌ దృష్ట్యా వీటిని లాంచ్‌ చేసినట్లు పేర్కొన్నారు.


హీరో నుంచి ప్యాషన్‌ Xtec

మరో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్‌ ప్యాషన్‌ Xtec మోడల్‌ను శుక్రవారం విడుదల చేసింది. దీని ధర రూ.74,590 (ఎక్స్‌షోరూం దిల్లీ ) నుంచి ప్రారంభమవుతుందని పేర్కొంది. ఇందులో 110 సీసీ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 9బీహెచ్‌పీ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. బ్లూటూత్‌ కనెక్టివిటీ, ఎస్సెమ్మెస్‌, కాల్‌ అలెర్ట్‌, రియల్‌టైమ్‌ మైలేజీ ఇండికేటర్‌, లో ఫ్యూయల్‌ ఇండికేటర్‌, సైడ్‌ స్టాండ్‌ ఇంజిన్‌ కటాఫ్‌, సర్వీస్‌ రిమైండర్‌ వంటి ఫీచర్లు ఉన్నాయని హీరో మోటోకార్ప్‌ తెలిపింది. ఇందులో డిస్క్‌ బ్రేక్‌ వేరియంట్‌ ధర రూ.78,990గా నిర్ణయించినట్లు పేర్కొంది. ఇప్పటికే విడుదలైన స్ప్లెండర్‌ ప్లస్‌ Xtec, గ్లామర్‌ 125 Xtec, ప్లెజర్‌+ 110 Xtec, డెస్టినీ 125 Xtec మోడళ్ల తరహాలో ప్యాషన్‌ Xtec కూడా వినియోగదారులను ఆకట్టుకుంటుందని ఆ కంపెనీ ఆశాభావం వ్యక్తంచేసింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని