Chetak EV: బజాజ్ నుంచి చేతక్ ప్రీమియం ఈవీ స్కూటర్.. ధర కూడా ప్రీమియమే!
Bajaj Chetak EV: బజాజ్ ఆటో కొత్త చేతక్ ఈవీని లాంచ్ చేసింది. బ్యాటరీ, మోటార్‌లో ఎలాంటి మార్పూ చేయనప్పటికీ.. కొన్ని ప్రీమియం ఫీచర్లు జోడించారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ ఆటో (Bajaj Auto).. చేతక్ ప్రీమియం ఈవీ 2023 ఎడిషన్‌ను (Premium EV 2023) లాంచ్ చేసింది. కొత్త విద్యుత్ స్కూటర్‌లో డిజైన్ పరంగా కొన్ని మార్పులు చేశారు. దీని ధరను సైతం కంపెనీ భారీగానే నిర్ణయించింది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న చేతక్ ప్రీమియం ధర రూ.1.22 లక్షలు (ఎక్స్‌షోరూమ్) కాగా.. లేటెస్ట్ ప్రీమియం స్కూటర్ ధర కంపెనీ రూ.1.52 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్) నిర్ణయించింది. ఈ స్కూటర్ బుకింగ్స్ ప్రారంభించామని, ఏప్రిల్ నుంచి డెలివరీ చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. కొత్త చేతక్‌తో పాటు పాత మోడల్ సైతం అందుబాటులో ఉండనుంది.
కొత్త చేతక్ ప్రీమియం స్కూటర్ ప్రత్యేకతల విషయానికొస్తే.. మూడు రంగుల్లో (గ్రే, బ్లూ, బ్లాక్) ఈ స్కూటర్ లభ్యం కానుంది. ఇందులో కన్సోల్‌ను కాస్త పెద్దగా.. కలర్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో అందిస్తున్నారు. డిస్‌ప్లే నాణ్యతను సైతం మెరుగుపరిచారు. ప్రీమియం టు- టోన్డ్ సీట్, స్కూటర్ రంగుకు అనుగుణంగా అద్దాలు అందించారు. అయితే, బ్యాటరీలో గానీ, మోటారులో గానీ ఎలాంటి మార్పులూ చేయలేదు. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 2.88kWh బ్యాటరీని అందిస్తున్నారు. సింగిల్ ఛార్జ్‌తో 90 కిలోమీటర్లు ప్రయాణించొచ్చని కంపెనీ చెబుతోంది. అలాగే విద్యుత్ స్కూటర్ల ఉత్పత్తిని సైతం పెంచనున్నట్లు బజాజ్ ఆటో తెలిపింది. కొత్త కలర్ ఆప్షన్స్, ప్రీమియం ఫీచర్లు గేమ్ ఛేంజర్ కానున్నాయని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శర్మ పేర్కొన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Siddharth: ఒంటరిగా పోరాడలేకపోతున్నా, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా: సిద్దార్థ్
-
Crime News
Toll Gate: గేటు తీయడం ఆలస్యమైందని.. టోల్ ఉద్యోగి హత్య
-
Movies News
Mukesh Khanna: రూ.300 కోట్లతో ‘శక్తిమాన్’ సినిమా.. వెల్లడించిన ముఖేశ్ ఖన్నా
-
Viral-videos News
viral videos: చిన్నారులుగా దేశాధినేతలు.. ఏఐ మాయ చూస్తారా..?
-
Movies News
‘హీరోలతో కలిసి భోజనం.. కాలర్ పట్టుకుని లాగేశారు’: బీటౌన్ ప్రముఖ నటుడు
-
World News
Kremlin: రష్యా రేడియోలు హ్యాక్.. పుతిన్ పేరిట నకిలీ సందేశం ప్రసారం!