Bajaj finserv Q2 results: బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ క్యూ2 ఫలితాలు

బజాజ్‌ గ్రూప్‌కు సంబంధించిన వివిధ ఆర్థిక సేవల వ్యాపారాలకు హోల్డింగ్‌ కంపెనీగా బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ వ్యవహరిస్తుంది.

Updated : 21 Oct 2022 16:49 IST

దిల్లీ: బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. రెండో త్రైమాసికంలో పన్ను అనంతర ఏకీకృత లాభం (PAT) రూ.1,557 కోట్లుగా నమోదైంది. గతేడాదితో పోలిస్తే 39% వృద్ధిని నమోదు చేసింది. అలాగే మొత్తం ఆదాయం గతేడాది కన్నా 16% పెరిగి రూ. 20,803 కోట్లకు చేరుకుంది.

బజాజ్‌ గ్రూప్‌నకు సంబంధించి వివిధ ఆర్థిక సేవల వ్యాపారాలకు హోల్డింగ్‌ కంపెనీగా బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ వ్యవహరిస్తోంది. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ గ్రూప్‌కే చెందిన రుణ సంస్థ బజాజ్‌ ఫైనాన్స్‌ కూడా తన త్రైమాసిక గణంకాలను ప్రకటించింది. ఈ సంస్థ పన్ను అనంతర త్రైమాసిక ఏకీకృత లాభం అత్యధికంగా రూ. 2,781 కోట్లను నమోదు చేసింది. ఈ లాభం గతేడాదితో పోలిస్తే 88% పెరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని